
Lokesh : పదవులు రాలేదని ఎవరూ ఆందోళన చెందొద్దని మంత్రి లోకేశ్ అన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారందరికీ పదవులు వస్తాయని భరోసా కల్పించారు. MLCలుగా బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించామని పేర్కొన్నారు.
దీంతో బలహీనవర్గాలపై TDP చిత్తశుద్ధి మరోసారి చాటుకుందన్నారు. మహిళలు, యువతను ప్రోత్సహించేందుకే గ్రీష్మకు అవకాశం ఇచ్చామని తెలిపారు. MLA కోటా MLC సీటు ఆశించిన పలువురు సీనియర్లకు నిరాశ ఎదురైన విషయం తెలిసిందే.