
Manchu Lakshmi : తెలుగు సినిమాల్లో మంచు ఫ్యామిలీకి కూడా ప్రత్యేక స్థానం ఉంది.. మోహన్ బాబు వారసులుగా ఆయన తర్వాత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ఈయన వారసులు.. మరి మంచి లక్ష్మి ప్రసన్న కూడా సినీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టారు.. మోహన్ బాబు సక్సెస్ అయినంత ఈయన వారసులు ఎవ్వరు కూడా సక్సెస్ కాలేక పోయారు..
మంచు లక్ష్మి కూడా అనగనగా ఒక ధీరుడు సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.. ఈమె ఏ సినిమాలు చేసినా అంతగా ఆకట్టుకోలేక పోయింది.. పైగా భారీ స్థాయిలో ట్రోల్స్ కూడా వచ్చాయి..
మరి ఈమె నటనలో మాత్రమే కాదు కొన్ని ప్రోగ్రాం లకు హోస్ట్ గా కూడా చేసింది.. ఈటీవీ, మాటీవీ అనే పెద్ద ఛానెల్స్ లోనే స్టార్ సెలెబ్రిటీలను ఇంటర్వ్యూ చేసింది.. ప్రస్తుతం కూడా ఈమె డిజిటల్ మీడియాలో ప్రసారమయ్యే వంట ప్రోగ్రాం కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది..
అయితే తాజాగా ఈమెకు టాక్ షోస్ అంటే ఎంత విసుగొచ్చింది అనేది తెలిపింది.. కొద్దీ రోజుల క్రితం జరిగిన ఇంటర్వ్యూలో ఈమెకు ఎదురైనా నష్టాల గురించి చెప్పుకొచ్చింది.. టాక్ షో నిర్వహిస్తున్నప్పుడు ప్రముఖ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కారణంగా ఎదురైనా ఇబ్బందులను, నష్టాలను చెప్పుకొచ్చింది.. నేను నిర్వహించే ఒక టాక్ షోకి అనుష్క శెట్టిని ఆహ్వానించాలని అనుకున్నాం.. అందుకు భారీగా ఏర్పాట్లు చేసాం.. కానీ ఆమె మా షోకి చివరి నిముషంలో రాలేక పోయింది. దీంతో 3 కోట్ల వరకు నష్టాలు వచ్చాయని ఈమె (Manchu Lakshmi) చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..