Anushka Shetty :
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో అనుష్క శెట్టి ఒకరు.. ఈమెకు ఓ రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారు.. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఆ భామ ఇప్పుడు మాత్రం పెద్దగా సినిమాలు చేయడం లేదు.. ఈ భామ బాహుబలి ముందు వరకు కూడా వరుస సినిమాలతో మెప్పించింది. ఇక బాహుబలి తర్వాత అంతగా కనిపించింది లేదు.
నిశ్శబ్దం సినిమాతో వచ్చిన అంతే నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. అనుష్క అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. పవర్ ఫుల్ రోల్స్ అంటే ఈ భామనే గుర్తుకు వస్తుంది.. ఆమె అరుంధతి సినిమా తోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోయిన ఈమె ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది.
మరి అలాంటి ఈ భామ మూడు పదుల వయసు ఎప్పుడో దాటేసిన ఇప్పటికి పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైన్ నే ఎంజాయ్ చేస్తుంది. ఈమె ప్రభాస్ తో రిలేషన్ లో ఉన్నట్టు వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు ఎన్నో వార్తలు వచ్చిన కూడా వీటిని ఖండించారు.. ఇదిలా ఉండగా ఈ భామకు ఫస్ట్ లవ్ ఉందట.. ఈమె గతంలో చెప్పిన తన ఫస్ట్ లవ్ గురించి ఇప్పుడు న్యూస్ వైరల్ అవుతుంది..
అనుష్క శెట్టి 6వ తరగతిలో ఉన్నప్పుడే ఒక వ్యక్తి ప్రపోజ్ చేసాడట.. తన క్లాస్ మేట్ నువ్వు చాలా అందంగా ఉన్నావ్ అంటూ చెప్పాడట.. అప్పట్లో పెద్దగా మెచ్యూరిటీ లేదు కాబట్టి తాను కూడా అతడిని లైక్ చేసినట్టు ఈమె తెలిపింది. అయితే తాను పెద్ద అవుతున్న కొద్దీ ఎవ్వరిని లవ్ చేయలేదని కెరీర్ కోసమే కష్టపడుతున్న అంటూ చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా ఈ భామ ఎవరినైనా పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయితే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.