21.6 C
India
Wednesday, February 11, 2026
More

    కొడుకును ప్రేమించి తండ్రితో జంప్.. ముసలోడు మామూలోడు కాదు మరి

    Date:

    Love the son
    మానవ బంధాలు మరింత నీచంగా తయారవుతున్నాయనడానికి ఇదే ఉదాహరణ. కొడుకును ప్రేమించిన యువతి కొడుకు తండ్రితో లేచిపోయింది. ఈ విషయం తెలుసుకున్న వారు ముక్కున వేలేసుకున్నారు. నవ్వి పోదురుగా నాకేటి సిగ్గు అన్న చందంగా ఆ జంట ఏడాది కాలంగా కాపురం కూడా చేసింది. ఇటీవల వారిని పోలీసులు పట్టుకున్నారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..

    ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటన  వెలుగు చూసింది. ఒక యువకుడిని ప్రేమించిన యువతి అతడితో ప్రేమ బంధంలో ఉంటూనే అతడి తండ్రికి కూడా దగ్గరైంది. చివరికి ప్రియుడి తండ్రితో ఇంటి నుంచి పారిపోయింది. ఢిల్లీలో సహజీవనం చేస్తున్న వీరిద్దరినీ ఏడాది తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఔరియాకు చెందిన కమలేశ్ పని కోసం కాన్పూర్‌లోని చకేరీ ప్రాంతానికి వచ్చి నివసిస్తున్నాడు. కమలేశ్ కు 20 సంవత్సరాల కొడుకు ఉన్నాడు. కొడుకు భవన నిర్మాణ కూలిగా పనుల చేస్తుంటాడు. ఆ యువకుడికి స్థానికంగా ఉండే 20 సంవత్సరాల యువతితో ఇటీవల పరిచయం ఏర్పడింది. రాను రాను వారు ప్రేమలో పడ్డారు.

    సదరు యువతిని పెళ్లి చేసుకుంటానని కమలేశ్ కొడుకు తండ్రికి పరిచయం చేశాడు. దీంతో ఆ యువతి తరుచూ కమలేశ్ కొడుకు కోసం అతని ఇంటికి వస్తూ ఉండేది. ఈ నేపథ్యంలో కమలేశ్ కొడుకు లేని సమయంలో వచ్చిన యువతిని కమలేశ్ లొంగదీసుకున్నాడు. మాయమాటలు చెప్పాడు. కొడుకు పెళ్లి చేసుకోవాల్సిన యువతితో వివాహేతర సంబంధం కొనసాగించాడు కమలేశ్. ఇంట్లో తెలిస్తే ఎలా అని యువతితో కమలేశ్ ఆ గ్రహం నుంచి వెళ్లిపోయాడు.

    అయితే, అప్పుడే సదరు యువతి కుటుంబ సభ్యులు ఆమె కోసం ఆరా తీసినా కనిపించలేదు. కమలేశ్ కొడుకు యువతి ప్రేమించుకున్నారని అందరికీ తెలుసు అయినా కమలేశ్ కొడుకు ఇంటి వద్దే ఉన్నాడు. అతని తండ్రిపై వారికి అనుమానం రాలేదు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ జంట కోసం వెతకడం ప్రారంభించారు. గతేడాది మార్చిలో ఇంటి నుంచి వెళ్లిపోయిన వీరు ఢిల్లీలోని ఒక ఇంటిని అద్దెకు తీసుకని నివశిస్తున్నట్లు తెలిసింది. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related