ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం కలవాలని ఆమె ఫోన్ చేసి చెప్పింది. తిరుపతి తన ఫ్రెండ్ తో కలిసి బైక్ పై వెళ్లి బాచుపల్లి ప్రధాన రహదారి వద్ద కలిశాడు. నిశ్చితార్థంపై ఆమె నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆవేశానికి గురైన తిరుపతి ఆమెను నీళ్ల ట్యాంకర్ కిందకు తోసేశాడు. దీంతో అక్కడికక్కడే చనిపోయింది. ప్రమాదవశాత్తూ పడిందని పోలీసులు, స్థానికులను నమ్మించే ప్రయత్నం చేశాడు తిరుపతి. పోలీసులు తమ స్టయిల్ లో మాట్లాడడంతో తానే ట్యాంకర్ కిందకు తోసేసినట్లు ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు బాచుపల్లి ఇన్‌స్పెక్టర్ ఎన్ సుమన్‌కుమార్, ఎస్ఐ సంధ్య తెలిపారు.
Lover pushed tanker Down : భర్త చనిపోవడంతో ఆమె ఒంటరిగా ఉంటోంది. అదునుగా భావించిన పరాయి వ్యక్తి ప్రేమిస్తున్నా అంటూ వెంటపడ్డాడు. నమ్మించాడు.. లోబరుచుకున్నాడు.. చివరికి హత్య చేశాడు. ప్రమాదంలా చిత్రీకరించేందుకు చాలానే జిమ్మిక్కులు చేశాడు. కానీ పోలీసులు మాత్రం ఛేదించారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కామారెడ్డి జిల్లా, మాచారెడ్డి మండలం, నెమలిగుట్ట తండాకు చెందిన హరిజియా కుమార్తె భూక్యా ప్రమీల(23) ఇంటర్ పూర్తి చేసింది. 2022, జనవరిలో వివాహం కాగా మూడు నెలలకే భర్త చనిపోయాడు. తండాలో ఉండలేక హైదరాబాద్ కు వచ్చింది. బౌరంపేట ఇందిరమ్మ కాలనీలో తన స్నేహితులైన ముగ్గురు యువతులతో కలిసి ఉంటుంది. బాచుపల్లిలోని ఓ స్టీలు దుకాణంలో పని చేస్తూ వస్తుంది.ఆమె పుట్టిన నెమలిగుట్ట తండాకు చెందిన భూక్యా తిరుపతి నాయక్ తో బాల్యం నుంచే పరిచయం ఉంది. అతను కూడా కొన్నాళ్ల క్రితం నగరానిక వచ్చి కొండాపూర్ లో ఉంటూ కార్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఒకే తండా వాసులు కావడంతో తరుచూ మాట్లాడుకునేవారు. అది కాస్తా ప్రేమకు దారి తీసింది. ప్రేమిస్తున్నా అంటూ లోబరుచుకున్నాడు. మోజు తీరిందని మరో యువతితో ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ప్రమీల తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. లేదంటే మీ కుటుంబ సభ్యులకు చెప్తానని చెప్పింది.