
Lulu group : తెలంగాణ యువతకు మరో గుడ్ న్యూస్. రాష్ర్టంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో దిగ్గజ సంస్థ ముందుకు వచ్చింది. తెలంగాణలో లులూ గ్రూప్ రూ. 3500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయబోతున్నది. రాష్ర్టంలో దశల వారీగా ఈ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోట్ లో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, లులూ గ్రూప్ యజమాని యూసుఫ్ అలీ ఒప్పందం కుదుర్చుకున్నారు.
కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్ గా ఉందని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా ఎదుగుతున్నదన్నారు. అయితే లులూ గ్రూప్ స్పందిస్తూ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఎక్స్ పోర్టు కోసం రూ. 3500 కోట్ల పెట్టుబడులు పెడుతామని చెప్పారు. రూ. 300 కోట్లతో హైదరాబాద్ లో షాపింగ్ మాల్ ప్రారంభిస్తామని చెప్పారు.
రానున్న రెండు నెలల్లో షాపింగ్ మాల్ ప్రారంభిస్తామని చైర్మన్ యూసుఫ్ అలీ తెలిపారు. ఈ మాల్ కు సంబంధించిన పనులు ఇప్పటికే 80 శాతం పూర్తయ్యాయని తెలిపారు. రాష్ర్టంలో మీట్, ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని, ఇక్కడి బియ్యాన్ని కూడా సేకరించబోతున్నామని తెలిపారు. దావోస్ లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే ఈ పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు.
ఏపీకి షాక్..
ముందుగా ఏపీలో పెట్టుబడులు పెట్టాలనుకున్న ఇప్పుడు విరమించుకుంది. తెలంగాణ వైపు మళ్లింది. ఇది నిజానికి ఏపీకి పెద్ద షాక్. ఇప్పటికే ఎన్నో కంపెనీలు ఏపీకి వెళ్లేందుకు విముఖత చూపుతున్నాయి. అమర్ రాజా కంపెనీ కూడా తెలంగాణకు వచ్చింది. ప్లాంట్ పెట్టిన కియా కూడా కొంత విముఖంగా ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు లులూ గ్రూప్ కూడా తెలంగాణకు వచ్చేసింది. దీనికి అక్కడి రాజకీయ పరిస్థితులే కారణమని టాక్ వినిపిస్తున్నది.
ఏదేమైనా ఏపీలో పరిస్థితులు తెలంగాణకు వరంగా మారుతున్నాయి. దీంతో పాటు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంపై కంపెనీల యాజమాన్యాలు నమ్మకంతో వస్తున్నాయని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. అయితే కంపెనీలన్ని తెలంగాణకు తరలిపోతున్నా ఏపీ సీఎం జగన్, ఐటీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పట్టనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తున్నది.