కథ :
ఇషిత ( తిలోత్తమ షోమే) తన ఇంట్లో సీమ (అమృతా సుభాష్) అనే పని మనిషిని పెట్టుకుంటుంది. ఈమెను పూర్తిగా నమ్మి ఇషితా ఉద్యోగం కోసం బయటకు వెళ్తే సీమ ఒక వ్యక్తితో ఇంట్లో రాసలీలలు నడుపుతుంది.. అనుకోకుండా ఒక రోజు ఇషిత ఇంటికి త్వరగా రావడంతో సీమ శృంగార రహస్యం బయట పడుతుంది. మరి సీమ ఎవరితో శృంగారంలో పాల్గొంటుంది? సీమ రాసలీలలు చూసిన తర్వాత ఇషిత తీసుకున్న నిర్ణయం ఏంటి? ఇషిత నిర్ణయం వల్ల సీమ ఎలాంటి రియాక్షన్ ఇచ్చింది? అనే విషయాలు తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ ను చూడాల్సిందే..
విశ్లేషణ :
కొంకణా సేన్ ఈ కథను చక్కగా చూపించడంలో సఫలం అయ్యింది.. లవ్, ఎమోషన్స్, అవసరాలు, కోరికలు, స్వార్ధం అనే అన్ని ఎలిమెంట్స్ ను చూపిస్తూ ఈమె కథ నడిపిన తీరు అందరిని ఆకట్టు కుంటుంది.. ఒక మహిళా దర్శకురాలిగా ఇద్దరు మహిళల భావోద్వేగం, మానసిక సంఘర్షణను పెర్ఫెక్ట్ గా చూపించింది..
పర్ఫార్మెన్స్ :
కొంకణా సేన్ సృష్టించిన రెండు పాత్రల్లో తిలోత్తమ షోమే, అమృత సుభాష్ ఒదిగిపోయారు.. ఈ ఇద్దరు ఈ బోల్డ్ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి. మురికి వాడల జీవితాన్ని, సంపన్నుల జీవితాల్లో ఉండే ఎమోషన్స్ ను కూడా టచ్ చేయగా ఈ పాత్రలలో వీరు ఒదిగిపోయి నటించారు. ఇక టెక్నీకల్ అంశాలు కూడా బాగున్నాయి.. రీ రికార్డింగ్ కూడా సన్నివేశాలను మరింత ఎలివేట్ చేసాయి.. ఆర్ట్, ఎడిటింగ్ పని తీరు ప్రొడక్షన్ వ్యాల్యూస్ అన్ని బాగున్నాయి.
చివరిగా..
శృంగార సన్నివేశాలు కాస్త ఎక్కువుగానే ఉన్నాయి.. శృంగారమే జీవితంగా భావించే మహిళకు.. శృంగారాన్ని ఆస్వాదించే మరో మహిళకు మధ్య జరిగే సన్నివేసాలను, మానసిక సంఘర్షణను కలిసి లస్ట్ స్టోరీస్ 2 లో చూపించారు.. పిల్లల్ని ఈ సిరీస్ చూసేందుకు దూరంగా ఉంచడమే ఉత్తమం.. అడల్ట్ సినిమాలను ఇష్టపడే వారికీ ఇది బాగా నచ్చుతుంది..
రేటింగ్ః2.5 5
ReplyForward
|