19.8 C
India
Sunday, February 25, 2024
More

    M.G.R. Ideal : ఎం.జి.ఆర్. ఆదర్శనీయుడు

    Date:

    M.G.R. Ideal
    M.G.R. Ideal
    • ఒకప్పటి తమిళ్ష్ సినిమా‌ స్యూపర్‌స్టార్, తమిళనాడు
    • ముఖ్యమంత్రి ఎం.జి.ఆర్., పుట్టినరోజు నేడు. ఆయన్ను స్మరించుకుందాం రండి..

    M.G.R. Ideal : సినిమా మాధ్యమంపై అంతకు మునుపు మఱెవరికీ లేని అవగాహన, పట్టు ఎం.జి.ఆర్. కు ఉండేవి.‌ 1936లో సతీలీలావతి అన్న తమిళ్ సినిమాలో ఒక చిన్న పాత్రతో మొదలుపెట్టాక 1950లకు ఆయన ప్రముఖ నటుడయ్యారు. ఎన్నో కష్టాలు, ఎంతో లేమి, ఎదురుదెబ్బలు వీటితో అలమటిస్తూ బతికి ఒక దశలో విజయాన్ని అందుకుని తమిళ్ష్‌నాడు
    చరిత్రలో సుస్థిరస్థానాన్ని పొందారు. ఆయన పోయి 36యేళ్లు అయినా ఆయన్ను తమిళ్ష్‌నాడులో
    రాజకీయంగా విమర్శించే సాహసం చెయ్యరు. ఆయన శ్రీలంకలో పుట్టిన మలయాళీ!

    సినిమా మాధ్యమాన్ని ఎం.జి.ఆర్.లా ఉపయోగించుకున్న మఱో సినిమా నటుడు ప్రపంచంలో లేడు.‌ ఏ‌ సినిమా ఆడుతుంది?‌ ఏ సినిమా ఆడదు? ఏ పాట హిట్ అవుతుంది? ఎలాంటి మాటలు ప్రజల్లోకి వెళతాయి
    వంటి వాటిపై గొప్ప పరిశీలన, అవగాహన ఉన్న వారు ఆయన.‌ ఎం.జి.ఆర్. మన ఎన్.టి.రామారావును నటుడిగా అభిమానిస్తారు!

    ఎం.జి.ఆర్. ఏ వయసు వ్యక్తినైనా మర్యాదతో సంబోధించేవారు ఇంగితం, కృతజ్ఞత వంటివి చాల మెండుగా ఉన్న వ్యక్తి ఆయన. కవులకు, కళాకారులకు ఎంతో మర్యాదనిచ్చేవారు. తన విజయానికి కవి పట్టుక్కోట్టై కళ్యాణసుందరం ఒక పెద్ద కారణం అని గట్టిగా చెప్పారు ఆయన. కవి కణ్ణదాసన్‌తో ఆయనకు విభేదాలుండేవి. ఆ కారణంగా కవి వాలిని ప్రోత్సహించారు. అయినా తాను రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాక కణ్ణదాసన్‌ను ప్రభుత్వ అస్థాన కవిని చేశారు. కణ్ణదాసన్ పార్దివ శరీరంతో శ్మశానం వఱకూ ముఖ్యమంత్రి ఎం.జి.ఆర్. నడిచివెళ్లారు! గాయని పి. సుశీలను కీర్తిస్తూ సుశీల దక్షిణాది లతామంగేశ్కర్ కాదు లత ఉత్తారాది సుశీల అన్నారు.

    ఎం.జి. ఆర్.‌ రాజకీయాల్లో ఉంటూ కూడా ఏనాడూ ఏ ఒక్కరినీ విమర్శించలేదు. బహుశా విమర్శ అంటూ చెయ్యని ఒకే రాజకీయనాయకుడు ఎం.జి.‌ఆర్. మాత్రమే నేమో?

    నాస్తిక ద్రావిడ పార్టీలో ఆస్తికుడు ఎం.జి.ఆర్! ఆయనకు జ్యోతిష్కంపై నమ్మకం ఉండేది. ఆయన‌ వ్యక్తిగత జ్యోతిష్యుడు కాళ్షియూర్ శ్రీనివాసాచారి కుటుంబంతో ఈ వ్యాస రచయితకు ఉన్న సాన్నిహిత్యంవల్ల ఈ విషయం తెలియజెయ్యబడుతోంది. బ్రాహ్మణులంటే ప్రత్యేకమైన అభిమానం కలవారు ఎం. జి. ఆర్.‌ (ద్రావిడ పార్టీల బ్రాహ్మణ వ్యతిరేకత నిజం కాదు)

    ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు తాను ఒక మెట్టు కింద ఉండే మాట్లాడేవారు! తనకు తెలుసు అన్నట్టుగా ఎవరితోనూ ఏ సందర్భంలోనూ తన ఆధిక్యతను, దూకుడుతనాన్ని చూపించేవారు కాదు ఎం. జి. ఆర్. ఇది‌ చాల గొప్ప లక్షణం!

    విశేషమైన సంకల్ప శక్తి, మనో నిబ్బరం ఎం. జి.ఆర్. కు‌ ఉండేవి. ఆయనకు తీవ్రమైన పక్షవాతం వచ్చింది. మానసిక స్థైర్యంతో దాని నుండి ఆయన బయటపడగలిగారు. అలాంటి పక్షవాతం వస్తే మళ్లీ లేచి మామూలుగా తిరుగాడడం అన్నది దాదాపుగా అసాధ్యం. ఆ పరిస్థితి నుండి ఎ‌ం.జి. ఆర్‌. తెప్పరిల్లారు. ఎం.జి.ఆర్ వైద్యుడు డాక్టర్. రత్నసబాపతి వ్యాసకర్తతో ఈ విషయాన్ని చెప్పారు. ఎం.ఆర్. రాదా (నటి రాధిక తండ్రి)
    ఎం.జి. ఆర్.ను చంపేందుకు తుపాకీతో కాల్చితే గురి తప్పి బుల్లెట్ ఆయన గొంతులోకి దిగింది. తెలుగువారైన డాక్టర్. చిట్టూరి సత్యనారాయణ విజయవంతంగా శస్త్ర చికిత్స చేసిన సందర్భంలో ఎం.జి.‌ఆర్. చూపిన మనో నిబ్బరం గుఱించి చిట్టూరి సత్యనారాయణ ఈ వ్యాసకర్తతో చెప్పారు.‌ ఆ హత్యా ప్రయత్నం తరువాత కొంతకాలానికి ఎం.జి.ఆర్. ను ద్రావిడ మున్నేఱ్ట్ర కళ్షగం పార్టీ నుండి కరుణానిది బహిష్కరించారు. అటు తరువాత ఎం.జి.ఆర్‌. సొంత పార్టీ పెట్టుకుని అంచెలంచెలుగా రాజకీయంగా ఎదుగుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. బతికున్నంత వఱకూ ఓటమి‌ లేని ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఏనాడూ,‌‌ ఏ‌‌‌ సందర్భంలోనూ ఎం.జి.ఆర్. కరుణానిదిని తూలనాడ లేదు పైగా ‘శ్రీయుతులు కరుణానిది’ అనే సంబోధించేవారు. జాతీయ కాంగ్రెస్ పార్టీని, అప్పటి దేశ ప్రధాని ఇందిరను కూడా విమర్శించలేదు, కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ఎదగనివ్వలేదు.

    తిరుగులేని నాయకుడిగా, ఓటమి ఎఱుగని ముఖ్యమంత్రిగా ఉండీ కూడా ఎ‌ం.జి.ఆర్ పెద్దగా డబ్బు కూడబెట్టలేదు! ఆయన తరువాత తన ఆస్తుల్ని చాల వఱకూ బీదలకు చెందేట్టు చేశారు.

    ‘ఇవ్వడం’ ఎం.జి.ఆర్. కు ఇష్టమైన విషయం‌. దా‌నం చెయ్యడాన్ని గొప్పగా చేసే వారు ఆయన.

    ఇంగితం, కృతజ్ఞత, అన్నం‌‌ పెట్టడం, తన‌ ఆధిక్యతను చూపించకపోవడం, సాటి‌ వ్యక్తికి మర్యాదనివ్వడం, కవుల్ని, కళాకారుల్ని గౌరవించడం వంటి లక్షణాలు ఎ‌ం.జి. ఆర్. ప్రత్యేకతలు.

    సర్వాధికారి అనే సినిమాలో ఎం.జి. ఆర్. తెలుగు మాట్లాడి కథా నాయకుడుగా నటించారు. గాయకుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గొప్పతనాన్ని మన తెలుగు అగ్ర నటులకన్నా ముందు గుర్తించి తనకు పాడించుకున్నారు ఎం.జి.ఆర్. బాలసుబ్రహ్మణ్యంను ఎంపిక చేసుకున్నాక పాట రికార్డింగ్ రోజుకు టైఫాయిడ్ జ్వరం బారిన పడ్డ బాలసుబ్రహ్మణ్యం పాడలేకపోతే రెండు నెలలు ఎం.జి. ఆర్. ఆగారు. బాలసుబ్రహ్మణ్యం అప్పటికి ఏ మాత్రమూ గుర్తింపు ఉన్న గాయకుడు కాదు. అయినా ఎంపిక చేసుకున్నాక బాలసుబ్రహ్మణ్యం కాకుండా ఇంకో గాయకుడి చేత పాడించుకుంటే ఎదగాల్సిన
    బాలసుబ్రహ్మణ్యంకు అది దెబ్బ అవుతుందని, బాలసుబ్రహ్మణ్యంకు మిత్రవర్గంలోనూ, మానసికంగానూ హాని జరుగుతుందని ఎం.జి.ఆర్.
    అంత కాలమూ వేచి ఉండి బాలసుబ్రహ్మణ్యం చేత పాడించుకున్నారు. ఈ ఉదంతం ఎం.జి. ఆర్.పై మనకు సరైన ఆలోచననిస్తుంది.

    మరుతూర్ గోపాలన్ రామచంద్ర మీనన్, ఎం.జి.ఆర్. పూర్తి పేరు‌.‌

    నింద, దూషణ, హింసా రాజకీయాలు చేసే ఇవాళ్టి రాజకీయ నాయకులు ఎం.జి.ఆర్.ను ఆదర్శంగా తీసుకోవాలి. ఎం.జి.ఆర్. ఓట్ల కోసం జాతి, జాతీయతా వ్యతిరేక రాజకీయాలు చెయ్యలేదు! మైనారిటీ వర్గాల ఓట్లతో గెలిచేందుకు ఎం.జి. ఆర్. దిగజారలేదు. ఎం.జి. ఆర్. కుల రాజకీయాలు చెయ్యలేదు. సంస్కృతికి, భారతీయతకు వ్యతిరేకంగా సినిమాలు చెయ్యలేదు. ఈ విషయాల్లో
    ఇవాళ్టి సినిమా కళాకారులకు, రాజకీయ నాయకులకు ఎం.జి. ఆర్. ఆదర్శనీయుడు.

     

     

     

    – రోచిష్మాన్
    9444012279
    అంతర్జాతీయ కవి, విశ్లేషకుడు, కాలమిస్ట్, జెమలజిస్ట్

    Share post:

    More like this
    Related

    TDP-Janasena : ఏ వర్గానికి ఎన్ని సీట్లు జగన్ పై గెలుపు లెక్కలు సరవుతాయా?

    TDP-Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి సామాజిక లెక్కలు గెలుపు...

    Prabhas : తనలో సీక్రెట్ బయట పెట్టేసిన ప్రభాస్

    Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్,...

    SHE Teams : ప్రేమ జంటలకు షీ టీం షాక్.. ఏం చేసిందంటే?

    SHE Teams : ప్రేమకు అర్థం (నిర్వచనం) మారిపోయిందేమో. ఒకప్పుడు లవ్...

    Jagan : కొండతో సామాన్యుడి ఢీ.. జగన్ పై పోటీ చేసేది ఇతనే.. ఇతని బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

    Jagan : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ ను బాబు,...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related