
Polimera 2 Teaser :
ఈ మధ్య కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువ అయ్యాయి.. ఎందుకంటే ప్రేక్షకుల అలాంటి సినిమాలనే ఆశిస్తున్నారు. అందుకే మేకర్స్ కూడా కొత్తగా ఇంట్రెస్టింగ్ గా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను తెరకెక్కిస్తూ ఆడియెన్స్ కు మంచి కిక్ ఇస్తున్నారు. మరి ఇప్పుడు హారర్ అండ్ థ్రిల్లర్ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న విషయం విదితమే..
ఈ క్రమంలోనే మరో కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది. ఆ సినిమానే ”మా ఊరి పొలిమేర”.. ఈ సినిమా రెండేళ్ల క్రితం రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించింది. ఇది డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా ”మా ఊరి పొలిమేర 2” తెరకెక్కింది.
బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించగా ఫస్ట్ పార్ట్ కిక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా సిద్ధం చేసారు. హాట్ స్టార్ లో సందడి చేయబోయే ఈ సినిమా నుండి ఇప్పుడు టీజర్ రిలీజ్ అయ్యింది. టీజర్ లో ఎక్కువుగా రివీల్ చేయలేదు కానీ ఈసారి చేతబడి కాన్సెప్ట్ ను మరింత క్రూరంగా చూపించినట్టు అయితే హింట్ ఇచ్చేసారు.
ఫస్ట్ పార్ట్ మొత్తం ఒక ఊరి లోనే సాగింది. ఇక ఇప్పుడు ఊరితో పాటు పలు లొకేషన్స్ లో కూడా తెరకెక్కించినట్టు అనిపిస్తుంది. ఇక ఫస్ట్ పార్ట్ లో తన నటనతో అలరించిన సత్యం రాజేష్ ఇప్పుడు కూడా తన నటనలోని విశ్వరూపాన్ని ప్రేక్షకులకు చూపించేందుకు రెడీ అయ్యాడు. సత్యం రాజేష్ చెప్పిన డైలాగ్ ఒకటి ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేస్తుంది.
”చంపితే తప్పు కానీ బలి ఇస్తే తప్పేంటి” అనే డైలాగ్ ను చెప్పడమే కాకుండా ఈ టీజర్ చివర్లో రక్తాన్ని ఒంటిమీద పోసుకునే సన్నివేశం హైలెట్ అయ్యాయి. ఇక అనిల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను శ్రీకృష్ణ క్రియేషన్స్ పతాకంపై నిర్మించారు.. అయితే ఈసారి ఈ సినిమాను ఓటిటి కాకుండా థియేటర్స్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.. చూడాలి ఈసారి బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ ఏ రేంజ్ లో మెప్పిస్తుందో.