26.5 C
India
Tuesday, October 8, 2024
More

    Khairatabad : భారీ జన సందోహం  మధ్య గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణపతి

    Date:

    Khairatabad
    Khairatabad Ganesh

    Khairatabad Ganesh :తొమ్మిది రోజలు పాటు భక్తలు చేత పూజలందుకున్న ఖైరతాబాద్ మహా గణనాథుడు గంగమ్మకు చేరాడు. ఈ ఏడాది సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమిచ్చిన లంబోదరుడు 11 రోజుల పూజల అనంతరం తల్లి గంగమ్మ ఒడిలోకి చేరుకుంది. సరిగ్గా మధ్యాహ్నం 1.34 గంటలకు మహా గణపతి నిమజ్జనం పూర్తయింది. వినాయకుని నిమజ్జనాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు గణపతి బప్పా మోరియా నినాదాలతో మార్మోగిపోయింది. మహా గణపతి నిమజ్జనానికి భక్తులు పోటెత్తారు. ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నంబర్ 4లో గణపయ్యకు చివరి పూజలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమం పూర్తి చేశారు.

    అంతకు ముందు ఖైరతాబాద్ వినాయకుని ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. ఈరోజు ఉదయం 6 గంటలకు చివరి పూజల అనంతరం గణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం మీదుగా ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్‌లకు పాదయాత్ర చేరుకుంది. ఖైరతాబాద్‌ బడా గణేష్‌ ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన 4వ నంబర్‌ క్రేన్‌ దగ్గర పూజల అనంతరం నిమజ్జనం చేశారు. బాహుబలి క్రేన్ సహాయంతో నిమజ్జనం పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. అంతకు ముందు ఎన్టీఆర్ మార్గ్ పరిసరాలను సీఎం రేవంత్ పరిశీలించారు. నిమజ్జన ఏర్పాట్లపై ఆరా తీశారు.

    హైదరాబాద్ నగరమంతటా గణేష్ నిమజ్జనాలు శోభాయాత్ర కొనసాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్షకు పైగా విగ్రహాలు నిమజ్జనం కావచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. నగరం నలుమూలల నుంచి వస్తున్న వినాయకుడితో ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్ ప్రాంతాలు సందడిగా మారాయి. నిమజ్జనాన్ని చూసేందుకు లక్షలాది మంది భక్తులు ట్యాంక్‌బండ్‌కు పోటెత్తారు. ‘జై బోలో గణేష్ మహరాజ్’, ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో పరిసరాలు మారుమోగుతున్నాయి. హుస్సేన్ సాగర్ ఎక్కడ చూసినా జనంతో నిండిపోయింది. ఆ ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. బాలాపూర్ గణేశ ఊరేగింపు కొనసాగుతుంది. ఉదయం వేలం పాట నిర్వహించారు. వేలం అనంతరం ఊరేగింపు ప్రారంభమైంది. హైదరాబాద్ పాతబస్తీ, చార్మినార్, ఎంజీ మార్కెట్ మీదుగా ఈరోజు సాయంత్రం బాలాపూర్ గణేషుడు హుస్సేన్ సాగర్ చేరుకుంటుంది. అనంతరం గణపయ్యను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయనున్నారు.

    Share post:

    More like this
    Related

    prison : దసరా వరకు జైళ్లలో ఇష్టా భోజనం.. ఎందుకు పెడుతున్నారంటే?

    prison : జగత్తుకు అన్నం పెట్టే తల్లి అన్నపూర్ణ. అలాంటి అమ్మ...

    Robots : మనుషులొద్దు.. రోబోలే ముద్దు.. వాటితో శృంగారానికి ప్రాధాన్యత

    Robots : శృంగారం విషయంలో మహిళల ఆలోచనలో మార్పు రానుందా? శృంగారం...

    Monkey : హృదయవిదారకం.. తల్లి చనిపోయిందని తెలియక తన పై పడి లేపుతున్న కోతి

    Mother Monkey Died : ఈ సృష్టిలో అమ్మ ప్రేమ మించింది...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ganesh Nimajjanam : గణేశ్ నిమజ్జనం చేయం..  వైసీపీ శ్రేణుల పంతం

    Ganesh Nimajjanam : ఏపీలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ....

    Allu Arjun : ఖైరతాబాద్ లోని ఆర్టీవో కార్యాలయానికి వచ్చిన అల్లు అర్జున్..

    Allu Arjun : ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ హైదరాబాదు...

    Khairatabad Ganesh : బాహుబలి.. మన ఖైరతాబాద్ గణేషుడు.. ఆ నిమజ్జనం వీడియో చూస్తే గూస్ బాంబ్స్

    Khairatabad Ganesh : మన దేశంలో వినాయక చవితిని ఎంతో ఘనంగా...