ఓం నమః శివాయ …… శంభో శంకర ….. హరహర మహాదేవ అంటూ శివ నామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి దేశ వ్యాప్తంగా ఉన్న శివాలయాలు. తెల్లవారు జామునే శివయ్య దర్శనం కోసం ఆసేతు హిమాచలం పరితపిస్తోంది. శివ నామ స్మరణతో , భక్తిప్రపత్తులు చాటుకుంటున్నారు భక్తులు. దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాలు శోభాయమానంగా తీర్చిదిద్దారు.
శివ పార్వతుల దర్శనం కోసం పడిగాపులు కాస్తున్నారు భక్తులు. మహా శివరాత్రి కావడంతో పెద్ద ఎత్తున భక్తులు గుళ్లకు వచ్చారు. దాంతో రద్దీ ఎక్కువ కావడంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు దేవాలయాల సిబ్బంది.