22.2 C
India
Saturday, February 8, 2025
More

    politics : మహారాష్ర్ట వేదికగా రాజకీయం..

    Date:

    kcr
    kcr
    politics : జాతీయ రాజకీయాల్లో  తాము కీలకంగా వ్యవహరించబోతున్నామని పదేపదే  చెబుతున్నా సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు ఒక్క మహారాష్ర్ట తప్ప మరో రాష్ర్టం వైపు దృష్టి సారించడం లేదు.  గత ఐదేళ్లుగా ఫెడరల్ ఫ్రంట్, థర్డ్ ఫ్రంట్ అంటూ 2018 నుంచి చెప్పుకొస్తున్నారు. ఏడాది క్రితం టీఆర్ఎస్ ను    భారత్ రాష్ట్ర సమితిగా మార్చారు. అయితే ఇప్పటిదాకా మహారాష్ట్రపై తప్ప మరో రాష్ట్రంపై కేసీఆర్ దృష్టి పెట్టడం లేదు.  తరచూ మహారాష్ర్ట నాయకులతో సంప్రదింపులు, చేరికలు తప్ప ఇంకోటి కనిపించడం లేదు. అయితే కేసీఆర్ సంకీర్ణ రాజకీయాలనే నమ్ముతున్నట్లు కనిపిస్తున్నది.
    ఏ కూటమిలో ఉండకుండా తటస్థంగా ఉంటున్నారు.  రేపు రెండు కూటములకు సరైన మెజార్టీ రాకుంటే తమకు ప్రాధాన్యం దక్కుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే ఇందుకు మహారాష్ర్టను ఎంచుకున్నారు. ఇక్కడ రాజకీయ అస్థిరత లాభించే అంశం. ఇప్పటికే శివసేన రెండుగా చీలిపోగా, మొన్నటి కి మొన్న ఎన్సీపీ కూడా రెండు చీలిపోయింది. ఈ అస్థిరతను కేసీఆర్ తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నారు. ఈ క్రమంలో మహారాష్ర్ట మీద దృష్టి పెడితే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు.
     అందుకు మహారాష్ట్ర సీట్లపైనే గురి పెట్టారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర రాజకీయాలపైనా కేసీఆర్ ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అక్కడ్నుంచి చేరికలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ భవన్ లో రోజూ చేరికలు ఉండేవి. అలాంటి తరహాలో వారానికో సారి ఓ బ్యాచ్ లీడర్లు వచ్చి తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ లో చేరికలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో మహారాష్ట్ర, తెలంగాణల్లో వచ్చే సీట్లతో… కేంద్రం మెడలు వంచుతామని, మహారాష్ట్రను అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. పార్లమెంట్ లో .. తెలంగాణలో వచ్చే బలం బీఆర్ఎస్‌కు సరిపోదని మరింత అదనపు బలం కోసం మహారాష్ట్రను గురి పెట్టారని రాజకీయవర్గాలు అంచనాకు వచ్చాయి.
    మహారాష్ట్రలో కేసీఆర్ సీట్లు సాధిస్తారో లేదో కానీ.. ఆయన మాత్రం కేంద్రంలో చక్రం తిప్పేందుకు  ప్లాన్ వేసుకున్నారని బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. కనీసం 30 సీట్లు సాధిస్తే… సంకీర్ణం వస్తుందని తాము ఎవరికి మద్దతు ఇస్తే వారే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని, కాలం కలసి వస్తే తమకే అతి పెద్ద ప్రాంతీయ పార్టీ కూటమి మద్దతు ఇస్తుందని సీఎం కేసీఆర్ అంచనా. కేసీఆర్ రాజకీయం మాత్రం.. మొత్తంగా మహారాష్ట్ర కేంద్రంగా మారుతోంది. అక్కడి ప్రజలపైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Actor Sonu Sood : తన అరెస్ట్ వారెంట్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన నటుడు సోనూసూద్

    Actor Sonu Sood : నటుడు సోనూ సూద్‌పై అరెస్ట్ వారెంట్ జారీ...

    Nagarjuna : బీజేపీ లోకి నాగార్జున..? కుటుంబంతో కలిసి మోడీ దగ్గరకు..

    Nagarjuna : టాలీవుడ్‌ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఇటీవల తన కుటుంబంతో...

    interest rates : లోన్లు తీసుకున్న వారికి గుడ్‌న్యూస్.. వడ్డీరేట్లు తగ్గించిన ఆర్బీఐ

    interest rates : ఆర్బీఐ శుభవార్త తెలిపింది. కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తూ...

    EV Buses : హైదరాబాద్-విజయవాడ మధ్య ఈవీ బస్సులు: టికెట్ ధర రూ. 99 మాత్రమే!

    EV buses: హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణించే వారికో శుభవార్త! ఈ రెండు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KCR : నేను కొడితే మామూలుగా ఉండదు.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

    KCR : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర...

    KTR Padhayatra: కేటీఆర్ పాదయాత్ర సక్సెస్ అవుతుందా… ఇప్పుడు చేయడానికి కారణం ఏంటో తెలుసా

    KTR Padhayatra: మాజీ మంత్రి కేటీఆర్ త్వరలోనే పాదయాత్ర చేయబోతున్నానని ప్రకటించారు....

    BRS Chief : ఫామ్ హౌజ్ లోనే బీఆర్ఎస్ అధినేత.. మౌనం వెనుక వ్యూహం ఉందా..?

    BRS chief KCR : తెలంగాణలో పార్టీ ఓటమి తర్వాత మాజీ సీఎం...

    Nalgonda : నల్గొండ బీఆర్ఎస్ కార్యాలయాన్ని 15 రోజుల్లో కూల్చివేయాలి.. హైకోర్టు ఆదేశం

    Nalgonda BRS : బీఆర్ఎస్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. 15...