
AP IPL team : ఇండియన్ క్రికెట్ చరిత్రలోనే కాకుండా ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎన్నటికీ మరిచిపోలేని వ్యక్తి మహేంద్రసింగ్ ధోని. ఆయన ఆట, కేప్టెన్సీ విలక్షణంగా ఉంటుంది. కూల్ కేప్టన్ గా ఆయన మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఆయన హయాంలోనే భారత్ వన్డే వరల్డ్ కప్ గెలిచింది. రెండు సార్లు టీ-20 వరల్డ్ కప్ కూడా గెలిసింది. ప్రస్తుతం ఆయన సారధ్యం వహిస్తున్న ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ దూసుకుపోతుంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు మూడు సార్లు కప్పు కైవసం చేసుకుంది.
ఇక ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. క్రికెట్ లో ఆంధ్రప్రదేశ్ పేరు దేశం యావత్తు వినాలనుకున్నారు. ఇందుకు ఆయన వచ్చే ఐపీఎల్ వరకు ఏపీ నుంచి ఒక జట్టును పంపాలని భావిస్తున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు, నిధుల గురించి కొన్ని రోజుల క్రితం క్రీడా మంత్రి, సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ జట్టును సాధ్యమైనంత త్వరగా పంపించాలని. దీంతో పాటు భారత్ తరుఫున ఆడే జట్టులో ఒకరికి తగ్గకుండా ఏపీ నుంచి ప్లేయర్ ఉంచేలా తర్పీదు ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పారు.
అయితే ఏపీ క్రికెట్ జట్టుకు శిక్షకుడిగా మిస్టర్ కూల్ కేప్టన్ మహేంద్రసింగ్ ధోనీని తిసుకురావాలని ఆయన అనుకున్నారు. భారత్ కు వరల్డ్ కప్పులు అందించిన అందించిన కేప్టెన్, ఐపీఎల్ లో సీఎస్‌కే సాధి మహేంద్ర సింగ్ ధోనీని ఈ అంశంపై ఆయన మాట్లాడినట్లు తెలిసింది. దానికి ధోని కూడా ఒకే అన్నట్లు తెలిసింది. కానీ అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. ప్రస్తుతం ధోని వరల్డ్ కప్ కు వెళ్లే భారత జట్టుకు మెంటార్ గా నియమితుడయ్యాడు. ఇక ఆయన బిజీ షెడ్యూల్ ఉండడంతో ఆఫ్టర్ వరల్డ్ కప్ తర్వాత ఏమైనా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.