Mahesh Babu and Rajamouli’s Film Update :
దర్శకధీరుడు రాజమౌళిది ప్రత్యేక శైలి. అతడు సినిమా మొదలు పెట్టాడంటే ఆపడు. సినిమా సినిమాకు గ్యాప్ కూడా ఎక్కువగానే తీసుకుంటాడు. ఈ సమయంలో హాయిగా విహార యాత్రలు చేస్తుంటారు. ట్రిపుల్ ఆర్ తరువాత సినిమాలు లేకపోవడంతో సరదాగా ఎంజాయ్ చేసేందుకు తమిళనాడు వెళ్లాడు. కుటుంబంతో సహా అక్కడ సరదాగా గడుపుతున్నాడు. తన చిత్రాల్లో ఏ ఇతివృత్తాలున్నా సినిమాను మాత్రం లెజెండ్ చేయడం ఆయన నైజం. అందుకే స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు తన చిత్రాల శైలిలో వైవిధ్యం ఉండేలా చూసుకుంటాడు.
తన వేసవి సెలవులను తమిళనాడులోని తుత్తుకుడిలో గడపుతున్నాడు. అక్కడి రీసార్ట్స్ లో మొక్కలు నాటారు. ఈ విషయం ఇన్ స్టా గ్రామ్ లో అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా కార్తికేయ మరోసారి ఈ ప్రాంతానికి వస్తానని రాశాడు. అక్కడి ప్రాంతం వారి కుటుంబానికి బాగా నచ్చినట్లుంది. త్వరలోనే మహేశ్ బాబుతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.
ఇదు అద్భుతమైన కథగా చెబుతున్నారు. ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికకుడిగా మహేశ్ బాబు నటిస్తాడు. అమెజాన్ అడవుల్లో షూటింగ్ ప్లాన్ చేసుకుంటున్నారు. రచయిత విజయేంద్ర ప్రసాద్ మహేశ్ బాబు కోసం ప్రత్యేకంగా ఈ కథ రెడీ చేస్తున్నాడు. మహేశ్ బాబు పుట్టిన రోజు ఆగస్టు 9న చిత్రం ప్రారంభించి వచ్చే సంవత్సరం షూటింగ్ మొదలు పెడతారని సమాచారం.
మహేశ్ బాబు పాత్ర జేమ్స్ బాండ్ తరహాలో ఉంటుందట. పాన్ ఇండియా లెవల్లో ప్రపంచాన్నే కుదిపేస్తుందని అంటున్నారు. కానీ ఇంకా క్లైమాక్స్ పై క్లారిటీ రాలేదట. అందుకే సినిమా నిర్మాణం ఆలస్యమవుతోంది. రాజమౌళిలో ఒక్క సినిమా చేస్తే పాతిక సినిమాలు చేసినట్లేనని మహేశ్ బాబు చెబుతున్నాడు. ఇలా వీరి కాంబినేషన్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది.