
Mahesh Babu : తెలుగు సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు కలియుగ కర్ణుడని చెప్పవచ్చు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో హిట్స్ అందించిన ఆయన.. ఎంతో మంది పేదలకు జీవితాన్ని అందించారు. 40కి పైగా సినిమాలకు పనిచేశారు. ఆయన స్వయానా సినిమా నిర్మాత కూడా. మహేష్ బాబుకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. మహేష్ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు సినిమాల ద్వారా కోట్లు సంపాదిస్తున్నాడు. తద్వారా ప్రతి ఏటా రూ.25 నుంచి 30 కోట్ల వరకు పేదలకు విద్య, వైద్యం కోసం వెచ్చి్స్తున్నట్లు చెబుతున్నారు. మహేష్ బాబు నికర ఆస్తి విలువ రూ.330 కోట్లు. హైదరాబాద్‌లో ఆయనకున్న బంగ్లా విలువ రూ.30 కోట్లు. జూబ్లీహిల్స్‌లోని ఈ ఇంట్లో దాదాపు అన్ని అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. మహేష్ బాబు దగ్గర 7 కోట్ల విలువైన వ్యానిటీ వ్యాన్ ఉంది. 2013లో విడుదలైన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు షూటింగ్ సమయంలో ఈ వ్యాన్‌ని కొనుగోలు చేశాడు.