
Mahesh Babu : దర్శకుడు రాజమౌళితో చేస్తున్న పాన్ ఇండియా సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోవడం లేదట. సినిమా ప్రారంభానికి ముందే, ఒకవేళ ఈ సినిమాకు నష్టాలు వస్తే తన రెమ్యూనరేషన్ తీసుకోనని, లాభాలు వస్తేనే అందులో నుండి 35% పారితోషికంగా తీసుకుంటానని మహేష్ బాబు ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నారట.
ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరూ ఒక్కో సినిమాకు వందల కోట్లు పారితోషికం తీసుకుంటున్న సమయంలో, మహేష్ బాబు మాత్రం లాభాల్లో వాటా తీసుకుంటానని చెప్పడంతో నిర్మాతలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారట.