
మిల్క్ బాయ్ గా గుర్తింపు సంపాదించుకున్న మహేశ్ బాబు అనతి కాలంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. చైల్డ్ హుడ్ నుంచి సినిమాల్లో నటిస్తున్న ఆయన ఆ సమయంలో కూడా భారీ హిట్లు సాధించాడు. దాదాపు రెండు దశాబ్ధాలకు పైగా ఇండస్ట్రీలో ఉన్న ఆయనకు ఫాలోయింగ్ కూడా ఎక్కువనే చెప్పాలి. పాన్ ఇండియా వ్యాప్తంగా ఆయన సనిమాలకు మంచి క్రేజ్ ఉంది. ‘పోకిరి’ లాంటి సినిమాను బాలీవుడ్ ప్రపంచం కూడా అభినందించింది. పూరీ జగన్నధ్, త్రివిక్రమ్ లాంటి దర్శకులతో బ్లాక్ బస్టర్ సినిమాలు తీశాడు మహేశ్ బాబు.
మహేశ్ బాబు రెమ్యునరేషన్ పెంచాడని ఇటీవల ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం మహేశ్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి #SSMB28 లో నటిస్తున్నాడు. కరోనాకు ముందు చిత్రం షూటింగ్ ప్రారంభమైనా కృష్ణ మృతి, అంతకు ముందు కృష్ణ భార్య (మహేశ్ బాబు తల్లి) మృతితో కొంత గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత మహేశ్ బాబు వెకేషన్ కు వెళ్లడంతో మరికొన్ని రోజులు నిలిచిపోయింది. అయితే ఇటీవల ఆ సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభించినట్లు తెలుస్తోంది.
అయితే ఆ సినిమా కోసం మహేశ్ బాబు భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. గతంలో కంటే భారీగా కోరుతున్నట్లు సమాచారం. #SSMB28 చిత్రానికి ఏకంగా రూ. 70 కోట్ల వరకూ తీసుకుంటున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. అయితే రాజమౌళి మహేశ్ బాబుతో తన తర్వాతి ప్రాజెక్టును ఇప్పటికే ప్రకటించాడు. దీనికి సంబంధించి ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ఈ సినిమాకు ఆయన ఏకంగా రూ. 110 కోట్ల వరకూ తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఇక మహేశ్ బాబు ప్రభాస్, అల్లు అర్జున్ లాగా వంద కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. మహేశ్ బాబు సినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ కలెక్షన్లను సాధించాయి. పోకిరీ, ఒక్కడు, అతడు, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే అవుతుంది. ఏది ఏమైనా మహేశ్ బాబు కూడా వంద కోట్ల క్లబ్ లో చేరనున్నారని సమాచారంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






