Mahesh Babu Daughter : స్టార్స్ కున్న ప్రాధాన్యత వారి పిల్లలకు కూడా ఉంటుంది. వారి ఫొటోలు చూడటానికి ఉత్సాహం చూపించడం కామనే. అందరు తమ పిల్లలు కనబడకుండా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కెమెరా కంట పడకుండా కాపాడుకుంటారు. నేరుగా వారిని సినిమాల్లోనే చూపించాలని అనుకుంటారు. ఇందులో భాగంగానే వారిని సినిమాలోనే పరిచయం చేయాలనుకోవడం సహజమే.
దక్షిణాదిన దాదాపు అందరు హీరోల కొడుకులను హీరోలుగా పరిచయం చేయడం చూస్తుంటాం. కానీ కూతుళ్లను మాత్రం హీరోయిన్లుగా రానివ్వరు. అలా వచ్చిన వారిలో కమల్ హాసన్ కూతురు శృతి హాసన్, అర్జున్ కూతురు లారా, శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ లు మాత్రమే హీరోయిన్లుగా పరిశ్రమకు పరిచయం అయ్యారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. కొడుకును బాల నటుడిగా తీసుకొచ్చిన అతడు కూతురును కూడా సినిమాల్లో పరిచయం చేయకున్నా సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు షేర్ చేయడం వైరల్ గా మారుతోంది. సితార డైరెక్టుగా సినిమాల్లో చేయకున్నా ఈవెంట్లకు మాత్రం తండ్రితో కలిసి వెళ్తోంది. వారి డ్యాన్సులు వీడియోల్లో షేర్ చేస్తూ ప్రేక్షకులతో కలివిడిగా ఉంటోంది.
తాజాగా ప్రముఖ బంగారు నగల తయారీ సంస్థ సీఎంజె జువెల్లర్స్ ప్రత్యేకంగా సితార కలెక్షన్ పేరుతో ఓ స్పెషల్ బ్రాండ్ ను తీసుకువచ్చింది. దీంతో సితార ధరించిన నగల ఫొటోలకు సంబందించిన యాడ్ న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ లో ప్రదర్శించారు. దీంతో సితార గురించి ప్రచారం జరిగింది. తమ కూతురుకు ప్రచారం నిర్వహిస్తున్న మహేశ్ బాబు ఉదాత్తమైన వైఖరిని అందరు ప్రశంసిస్తున్నారు.
ReplyForward
|