స్టార్ హీరోలతో చిన్న హీరోలు ప్రమోట్ చేయించుకుంటే వారి సినిమాలకు తిరుగులేని హైప్ వస్తుంది అని బలంగా నమ్ముతారు.. అందుకే ఈ మధ్య చిన్న సినిమాలకు స్టార్ హీరోలను వాడుకోవడం పరిపాటి అయిపొయింది. అయితే స్టార్ హీరోలు ఎంత చెబితే అంత పాటించే ఫ్యాన్స్ ఉన్న నేపథ్యంలో వారు కూడా ఆచితూచి ప్రమోషన్స్ కు అంగీకరించాల్సి ఉంటుంది..
అందుకే స్టార్స్ తమ సోషల్ మీడియాను జాగ్రత్తగా వాడుతారు.. ఈ విషయంలో స్టార్స్ పిఆర్ టీమ్ లను ఏజెన్సీలను బాగా నమ్ముతుంటారు.. సెలెబ్రిటీలు ప్రతీ ట్వీట్ వారు చేయరు.. తమ టీమ్స్ అవి చుసుకుంటాయి.. అయితే ఒక్కోసారి పిఆర్ టీమ్ లను నమ్మిన కూడా ఆడియెన్స్ చేత విమర్శల పాలు అవ్వడం ఖాయం.. ఇప్పుడు తాజాగా మహేష్ బాబు కూడా విమర్శల పాలు అవుతున్నారు.
మహేష్ ట్వీట్ చేసారంటే అందులో కరెక్ట్ ఉంటుంది అని ఫ్యాన్స్ ఇన్నాళ్లు నమ్మారు.. అందుకే ఆయన హ్యాండిల్ కు ఒక విశ్వసనీయత అనేది ఉంది. కానీ ఈయన తాజాగా మేమ్ ఫేమస్ సినిమా కోసం ట్వీట్ చేయడంతో ఇప్పటి వరకు అందరు నమ్మిన నమ్మకాన్ని కోల్పోయాడు. మహేష్ సినిమాను తాను చూశాడని అద్భుతంగా ఉందని ట్వీట్ చేసాడు..
అయితే ఏ ట్వీట్ తో ఈ సినిమాకు ఎంత హైప్ వచ్చిందో ఈ సినిమా విడుదల తర్వాత మహేష్ ట్వీట్ అంతగా చీప్ గా చూస్తున్నారు. సోషల్ మీడియాలో అనేక రకాలుగా కామెంట్స్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.. సినిమాలో ఏం నచ్చిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మహేష్ ఈ సినిమాను చూసి ఉండడని.. తన పిఆర్ టీమ్ ను గుడ్డిగా నమ్మడంతోనే దారుణంగా ఇప్పుడు ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది అంటూ చెబుతున్నారు.
అయితే ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావడంతో వారు మాత్రం హ్యాపీ.. మహేష్ ఫ్యాన్స్ మాత్రం నిరాశ చెందుతున్నారు. ఇలాంటి పనులు ఇంకోసారి జరగకుండా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు.