#OG First Look :
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో భారీ అంచనాలు ఉన్న మూవీ ‘#OG’. ఈ సినిమా షూటింగ్ మూడు నెలల నుంచి విరామం లేకుండా సాగుతూనే ఉంది. పవన్ నెల రోజులు వరుసగా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని ‘వారాహి యాత్ర’లో బిజీ అయ్యాడు. ఆయన పోర్షన్ మినహా మిగతా సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేశారు మేకర్స్.
ఈ సినిమాకు ఉన్న హైప్, క్రేజ్ టాలీవుడ్ లో ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న ఏ సినిమా మీద లేదు అనడం లో సందేహం లేదు. ఈ మూవీ నుంచి ఏదైనా ఫొటో వచ్చినా, మేకింగ్ స్టిల్ వచ్చినా సోషల్ మీడియాను తీవ్రంగా హైప్ కు గురిచేస్తుంది. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ జరుగుతుంది. ఇది ఇలా ఉండగా కాసేపటి క్రితమే (జూలై 26వ తేదీ) ఈ చిత్రం నుంచి వర్కింగ్ స్టిల్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ వర్కింగ్ స్టిల్ లో పవన్ కళ్యాణ్ చేతిలో కత్తి పట్టుకొని మార్షల్ ఆర్ట్స్ చేస్తూ ఫోజిస్తాడు. ఇది చూసి అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. మూడు రోజుల్లో ‘బ్రో: ది అవతార్’ విడుదలను కూడా మర్చిపోయి ఫ్యాన్స్ మొత్తం #OG జపం చేయడం మొదలు పెట్టారు.
ఇది కేవలం వర్కింగ్ స్టిల్ మాత్రమే అని, అసలు ఫస్ట్‌లుక్ ఆగస్టు 15వ తేదీ విడుదల చేస్తామని, అది చూస్తే ఫ్యాన్స్ కు మరింత పూనకాలు లోడింగ్ కావాల్సిందే అని ఈ సినిమాలో పని చేస్తున్న క్రూ సభ్యులు చెప్తున్నారు. ఆగస్ట్ 15వ తేదీ ఫస్ట్ లుక్ విడుదల చేసి, పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. దీని గురించి త్వరలో అధికారిక ప్రకటన రానుంది.