Malayappa Swamy : కలియుగ దైవం వెంకటేశ్వరుడు. వడ్డీకాసులవాడు. వైకుంఠవాసుడు. శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేస్తుంటారు. తమ కోరికలు తీర్చాలని వేడుకుంటారు. దేవస్థానం కూడా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఎక్కడ కూడా అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. దీంతో గుడికి వచ్చే భక్తులకు సకల సదుపాయాలు కల్పిస్తుంది.
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం రాత్రి శ్రీమలయప్ప స్వామి వారు తనకెంతో ఇష్టమైన గరుడవాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తారు. భక్తకోటికి దర్శనమిస్తుంటారు. ఏనుగులు, అశ్వాలు ఠీవీగా ముందు వెళ్తుంటాయి. వెనక భక్తులు స్వామి వారిని కొలుస్తూ తిరుగుతుంటారు.
భక్తుల కోలాటాలు ఆద్యంతం ఆకట్టుకుంటయి. డప్పు, వాయిద్యాలు, కళా ప్రదర్శనలు కోలాహలంగా సాగుతాయి. భక్తులు గోవింద నామ స్మరణతో తిరువీధులు మార్మోగుతాయి. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి వాహన సేవలో పాల్గొన్నారు. కన్నుల పండుగగా సాగుతున్న స్వామి ఊరేగింపుకు భక్తులు అధికసంఖ్యలో హాజరయ్యారు.
స్వామి వారి ఊరేగింపుకు భక్తులు ఎక్కువ మంది వస్తుంటారు. భక్తితో దేవుడి వెంట నడుస్తారు. తమ కోరికలు తీర్చాలని వేడుకుంటుంటారు. ఊరేగింపు వేడుకగా జరుగుతుంది. భక్తుల సందోహం మధ్య స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఆద్యంతం కార్యక్రమం ఆసక్తికరంగా సాగుతుంది. చూడముచ్చటగా స్వామి వారిని అలంకరించి తీసుకెళ్తారు.