
Ambani house : దేశంలోనే అత్యంత ధనవంతుడు ముఖేశ్ అంబానీ. ఆయన ఆస్తులు పెరగడమే కానీ తరగడం ఉండదు. ఆయన ముచ్చటపడి కట్టకున్న ఇంటి పేరు ‘ఆంటీలియా’. ప్రపంచంలోనే ఏ కుబేరుడికి కూడా ఇంత కాస్ట్, ఇంత కంఫర్ట్ ఇళ్లు లేదంటే సందేహం లేదు. పెట్రోల్ ప్యూరీఫయర్ ఫ్యాక్టరీలతో పాటు కెమికల్ ఇండస్ట్రీలు, ప్రముఖ నెట్ వర్క్ జియో కూడా ఆయన సొంతమైనవే.
ఆయన ఇంట్లో ఏ చిన్న వేడుకైనా అధిక ఖర్చుతో కూడుకోవడం కామనే. ఇటీవల వారు ఒక పూజ చేశారు. ఈ పూజకు సంబంధించి వీడియో నెట్టింట్లో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఇదేదో బంగారం, వెండి, డబ్బులు కుమ్మరించి చేసిన పూజ కాదు. మామిడి పండ్లతో చేసిన పూజ. వేలాది మామిడి పండ్లను తన పూజగదిలో అలంకరించి వైభవంగా నిర్వహించారు. బంధు మిత్రులు చాలా మంది వేడుకలకు హాజరయ్యారు.
ముఖేశ్ తన నివాసం ఆంటీలియాలో ప్రత్యేకంగా ‘మామిడి మనోరత్’ ఏర్పాటు చేసి పూజలు చేశారు. అంబానీ గ్రూప్ ప్రపంచ వ్యాప్తంగా మామిడి లేదా ఆమ్ యొక్క అతిపెద్ద ఉత్పత్తిదారుల్లో ఒకటి, స్టాక్ ను ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. తన పూజగదిలో శ్రీరాముడు-సీత, లక్ష్మణుడు, రాధా కృష్ణుల ఫొటోల మధ్య మామిడిపండ్లు అందంగా అలంకరించారు. ప్రపంచానికే సరఫరా చేసే ఉత్పత్తులైన మామిడి పండ్లతో ఏటా ఇలా పూజలు చేస్తూనే ఉంటారు. మ్యాంగో పండ్ల మధ్య డెకరేషన్ లైట్లను కూడా అమర్చారు. దీంతో ‘మామిడి మనోరత్’ అంబాని ఇంట్లో సక్సెస్ అయ్యిందని చెప్పవచ్చు.
*#Mango #Manorath at Mukesh #Ambani House* #Reliance is the largest single producer of Mangoes. pic.twitter.com/pp41kGhw6a
— Rajiv Mehta (@rajivmehta19) June 24, 2023