
Nagashaurya Rangbali : టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో నాగ సౌర్య ఒకరు.. ఈయన ఎన్నో మంచి మంచి సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.. ముఖ్యంగా ఛలో సినిమాతో ఈయన తెలుగులో ఆడియెన్స్ కు మరింత దగ్గర అయ్యాడు. వెంకీ కుడుముల, నాగ సౌర్య కాంబోలో వచ్చిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా ఈ సినిమాతో ఈ కాంబో బ్లాక్ బస్టర్ అందుకుంది..
ఇక ఆ తర్వాత నాగ సౌర్య సినిమాలు చేస్తూ ఆ రేంజ్ లో అలరించలేక పోతున్నాడు. మాములు హిట్ తోనే సరిపెట్టు కుంటున్నాడు.. ఇదిలా ఉండగా ప్రస్తుతం నాగ సౌర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”రంగబలి”.. ఈ సినిమాకు డైరెక్టర్ పవన్ బసమసెట్టి దర్శకత్వం వహిస్తుండగా జులై 7న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో ఆడియెన్స్ కు ఈ సినిమాను చేరువ చేసారు.. వీరికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించగా తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.. ”మన ఊర్లో మనల్ని ఎవడ్రా ఆపేది” అంటూ సాగే ఈ సాంగ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసారు. ఈ ప్రోమోను మాస్ ఆడియెన్స్ నుండి క్లాస్ ఆడియెన్స్ వరకు మంచి రెస్పాన్స్ అందుకుంది.
ఇక ఇప్పుడు ఈ సాంగ్ కు సంబంధించిన పూర్తి వర్షన్ ను ఈ రోజు సాయంత్రం 4 గంటల 5 నిముషాలకు రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేసారు.. అందుకే ఈ సాంగ్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. ఇక పవన్ సి హెచ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తుంది.. శ్రీ లక్ష్మి వెంకటేశ్వరా సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాతో నాగ సౌర్య ఎలాంటి హిట్ అందుకుంటాడో వేచి చూడాలి..