Manchu Lakshmi : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మంచు లక్ష్మికి మొదటి నుంచి మంచి టాలెంట్ ఉంది. ఆమె ఒక్క సినిమాలే కాదు.. అడ్వర్‌టైజ్‌మెంట్, యాడ్ డైరెక్షన్, మూవీ డైరెక్షన్, సింగర్, యాక్టర్, విలన్ ఇలా ఒక సినిమాకు చెందిన చాలా వరకు విభాగాల్లో చేయి పెట్టింది. మంచు లక్ష్మి ఇండియాలో నటించేందుకు ముందే అమెరికాలో ఫేమస్ కంపెనీ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహిరించింది. అలాగే అక్కడ సీరియల్ లో కూడా నటించింది. అయితే కొన్ని నెలలుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చురుకుగా ఉంది.
తన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇన్ స్టా, లేదంటే ఎక్స్ లో షేర్ చేస్తుంది. తన లెటెస్ట్ ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా మంచు లక్ష్మి షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ నటించిన దేవర: పార్ట్ 1 ఇటీవల రిలీజై భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. పాటలు కూడా చార్ట్ బస్టర్ అయ్యాయి. ముఖ్యంగా చుట్టమల్లె సాంగ్ అభిమానులను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. ఎన్టీఆర్ స్టెప్పులు, జాన్వీ అందాలు ఈ సాంగ్ కు స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. ఈ కారణంగా చుట్టమల్లె యూ ట్యూబ్ లో రికార్డ్ వ్యూవ్స్ ను కొల్లగొట్టింది.
View this post on Instagram
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సాంగే వినిపిస్తుంది. ప్రముఖులతో పాటు నెటిజన్లు కూడా ఈ సాంగ్ ణు రీక్రియేట్ చేస్తూ రీల్స్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. తాజాగా మంచు లక్ష్మి కూడా ఈ సాంగ్ కు కాలు కలిపింది. బ్లాక్ శారీలో ఉత్సాహంగా స్టెప్పులేసింది. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. దీన్ని చూసిన ఆమె అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ పెట్టారు. ‘సూపర్ డ్యాన్స్ మేడం’ అని అంటూ కొందరు మెచ్చుకున్నారు. మరి కొందరు నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనా ఈ సాంగ్ తో మరోసారి మంచి లక్ష్మి ట్రెండింగ్ లోకి వచ్చింది.
Devara beats got my South Indian spirit grooving non-stop! 💃🔥 pic.twitter.com/M3vSwbhFNe
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) September 30, 2024