Manchu Lakshmi into BJP : మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి అందరికీ తెలిసిన వ్యక్తే. ప్రస్తుతం ఆమె సినిమాల్లో కనిపించకున్నా.. వివిధ టీవీ షోలలో మాత్రం కనిపిస్తూనే ఉంది. ఆమె తక్కువ సినిమాలు మాత్రమే చేసింది. అందులో కొన్ని పాజిటివ్ కాగా.. కొన్ని నెగెటివ్ రోల్స్ కూడా చేసింది. ఆమె బాడీ ల్యాంగ్వేజీకి ఎక్కువగా విలన్ పాత్రలు బాగా నప్పుతాయని ఇండస్ట్రీకి మొత్తం తెలిసిందే. నిర్మాతగా కూడా ఆమె తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఇక ఇటీవల పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఆమె తండ్రి మోహన్ బాబు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో టీడీపీలో పని చేశారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి సపోర్ట్ గా పని చేస్తున్నారు. మోహన్ బాబు ఇద్దరు కొడుకులు మంచు విష్ణు, మంచు మనోజ్. ఇందులో ఒకరు టీడీపీకి, మరొకరు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కో పార్టీలో ఉన్నారని అనుకుందో ఏమో గానీ మంచు లక్ష్మి కూడా ఒక పార్టీని ఎంచుకుంది. ఆమె త్వరలో బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆమెను పార్టీలో చేర్చుకోవాలని బీజేపీనే అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆమెకు పీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని, అందుకే ఆమె రేపు (సెప్టెంబర్ 21) ఢిల్లీకి వళ్తుందని తెలుస్తోంది.
టీడీపీ నేత కూతరు భూమా మౌనికను మనోజ్ వివాహానికి సంబంధించి కుటుంబం ఎంత సఫర్ అయ్యిందో ఇంటర్వ్యూలో చెప్పుకచ్చారు. ఏడాది పాటు ఎవరికీ తెలియకుండా భూమా మౌనికతో మనోజ్ ప్రేమాయణం కొనసాగించాడు. కాగా మంచు లక్ష్మి పెద్దగా వ్యవహరిస్తూ వారికి పెళ్లి చేసింది. అయితే మంచు విష్ణు జగన్ బంధువులను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అన్నదమ్ములు ఇద్దరూ ఇరు పార్టీలకు చెందిన వారిని పెళ్లి చేసుకోగా.. సోదరి లక్ష్మికి మూడో పార్టీ నుంచి పిలుపు రావడం ఆశ్చర్యంగా ఉందని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
అయితే బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా పెద్ద పెద్ద సెలబ్రెటీలను పార్టీలోకి రావాలని కోరుతుంది. ఇందులో భాగంగానే మంచు లక్ష్మికి బీజేపీ కార్యాలయం నుంచి కబురు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే గనుక నిజమైతే.. ఒకే ఇంట్లో స్టేట్ తో పాటు నేషనల్ పాలిటిక్స్ కూడా మొదలవుతాయన్నమాట.