ప్రధాని నరేంద్ర మోడీ ‘మన్ కీ బాత్’కు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా మంచి క్రేజ్ ఉంది. ప్రవాస భారతీయులు ఎక్కడ ఉన్నా ఆయన ‘మన్ కీ బాత్’ వినేందుకు ఇష్టపడుతుంటారు. చిన్నారుల భవిష్యత్, ధరిత్రి పరిరక్షణ ఇలా అంశాలను ప్రధాని తనదైన శైలిలో మన్ కీ బాత్ లో వివరిస్తుంటారు. ప్రధాని అయిన తర్వాత ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు రూపొందించిన ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు నరేంద్ర మోడీ.
మన్ కీ బాత్ 100వ భాగం శనివారం (ఏప్రిల్ 29)న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మన దేశంతో పాటు విదేశాల్లో కూడా వైభవంగా కొనసాగుతుంది. దేశ దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు ఇందులో పాల్గొని భారత ప్రధాని ఆశలు, ఆశయాలు, భారత్ సాధించిన ప్రగతిని ఆలకించారు. ఇందులో భాగంగా అమెరికాలోని న్యూ జెర్సీలో కాన్సులేట్ జనరల్ ఫెడరేషన్ (FIA) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేశారు. వివిధ సంస్థల ప్రముఖులు, మేధావులు ఇందులో పాల్గొనేందుకు ఆసక్తిని కనబర్చారు. దాదాపు 1000 మంది వరకూ పాల్గొని భారత్ ఆకాంక్షలను మోడీ నోటి వెంట విన్నారు. అమెరికా కాలమాణం ప్రకారం అర్ధరాత్రి 12.45 గంటలకు కూడా ఆయన ప్రసంగాన్ని వినేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు.
అమెరికా, న్యూజెర్సీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో న్యూయార్క్ సెనెటర్ కెవిన్ థామస్, జెన్నిఫర్, ఎడిసన్ మేయర్ సామ్ జోషి, తరుణ్ జీత్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హాల్ హాలంతా ‘భారత్ మాతకీ జై.. జై నరేంద్ర మోడీ’ అంటూ నినాదాలు వెల్లువెత్తాయి. ఉత్సాహంగా ఈ కార్యక్రమం సాగింది.