
Mark Shankar : తన కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, కోలుకుంటున్నాడని Dy.CM పవన్ ప్రకటించారు. సింగపూర్‌లోని స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన తన కొడుకు కోసం ప్రార్థనలు చేసిన వారందరికీ Xలో ధన్యవాదాలు తెలిపారు. ఈ కష్టసమయంలో అండగా నిలిచిన జనసేన పార్టీ కార్యకర్తలు, నేతలు, శ్రేయోభిలాషులు, సినీ, రాజకీయ ప్రముఖులకు కృతజ్ఞతలు చెప్పారు. కాగా కొడుకుతో కలసి పవన్ నిన్న ఇండియాకు తిరిగొచ్చారు.