
Mass Raja suffering : మాస్ మహారాజ రవితేజ ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు.. ఈయన మొదట్లో చాలానే సఫర్ అయ్యారు.. ఎన్నో సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ కూడా చేసారు.. అయితే ఒక్కో సినిమాతో ఈయన తన మార్క్ పెంచుకుని హీరో అయ్యి ఇప్పుడు స్టార్ స్టేటస్ అనుభవిస్తున్నాడు.. మాస్ రాజా టైమింగ్స్ ను అందరు ఇష్టపడతారు.
ఆయన కామెడీ, యాక్షన్, రొమాంటిక్ అన్ని కూడా ప్రేక్షకులను మెప్పిస్తాయి.. ఇప్పటి వరకు మాస్ రాజా కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి.. ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, కిక్, క్రాక్ మొన్న మొన్న వచ్చిన ధమాకా సినిమా లాంటి ఎన్నో సూపర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్న రవితేజ మాస్ రాజాగా ఎదిగారు..
ఇక ఈ మధ్య చిరుతో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు.. వాల్తేరు వీరయ్యలో ఈ ఇద్దరు కూడా యాక్షన్ తో మెప్పించాడు.. ఆ తర్వాత వచ్చిన రావణాసుర హిట్ అవ్వలేదు.. ఇక ప్రజెంట్ టైగర్ నాగేశ్వరరావు వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తూ బిజీగా ఉన్నాడు.. అయితే ఈయన ఆరోగ్యం గురించి ఇప్పుడొక వార్త నెట్టింట వైరల్ అవుతుంది..
మాస్ రాజాకు 55 ఏళ్ళు.. ఈయన కంటే పెద్ద ఏజ్ ఉన్న హీరోలు కూడా అందం బాగా మైంటైన్ చేస్తున్నారు.. కానీ రవితేజ ఫేస్ మాత్రం స్కిన్నీ అయిపోవడంతో ఈయన వ్యాధితో బాధపడుతున్నాడు అని రూమర్స్ వచ్చాయి.. ఇందులో నిజం ఉంది అంటున్నారు. మాస్ రాజా ఆకలి లేమితో అంటే ల్యూక్ వ్యాధితో బాధ పడుతున్నారట.. ఈ వ్యాధి వల్ల రవితేజకు ఆకలి ఉండదని అందుకే ఈయన ముఖం, స్కిన్ మొత్తం డల్ అయిపోయాయి అని అంటున్నారు.