
MATA Mother’s Day Celebrations : అమెరికాకు వెళ్లినా, ఆస్ట్రేలియాకు వెళ్లినా మన తెలుగు వాళ్ల సందడి మాములుగా ఉండదు. ఎక్కడికెళ్లినా మన ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. మన పండుగలే కాదు.. అంతర్జాతీయ దినోత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. తాజాగా మే 31న (శుక్రవారం సాయంత్రం) మదర్స్ డే సెలబ్రేషన్స్ ను ఘనంగా జరుపుకున్నారు. అమెరికాలో ఉన్నామా? అమలాపురంలో ఉన్నామా? అన్నట్టుగా తెలుగు మహిళలు సంప్రదాయ చీరలు, భారతీయ వస్త్రాలతో హాజరై సందడి చేశారు.
మన అమెరికన్ తెలుగు అసొసియేషన్ (MATA) మరియు కళావేదిక ఆధ్వర్యంలో మదర్స్ డే వేడుకలను అమెరికాలో..1050 కింగ్ జార్జెస్ పోస్ట్ రోడ్, ఫోర్డ్స్ , న్యూజెర్సీ 08863 లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా ఎడిసన్ మేయర్ సామ్ జోషి హాజరయ్యారు. ఈ వేడుకలకు అతిథులుగా తెలుగు సినీ హీరోయిన్ శ్రీలీల, యాంకర్ సుమ, సింగర్ శ్రీనిధి తిరుమల, యాంకర్ శ్రీలక్ష్మి కులకర్ణి హాజరయ్యారు. సుమ తన యాంకరింగ్ తో మహిళలతో ఆడిపాడి అలరించారు. తన అద్భుత వాక్ చాతుర్యంతో ఆకట్టుకున్నారు. అచ్చం మన హైదరాబాద్ లేదా విజయవాడలో జరిగినట్టుగా సెలబ్రేషన్స్ జరుగడం విశేషం. ఆ తర్వాత మహిళల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విజేతలకు బహుమతులు కూడా అందించారు. మహిళలకు కుటుంబ సమేతంగా హాజరుకావడంతో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ వేడుకలను మన అమెరికన్ తెలుగు అసొసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గనగోని, సెక్రటరీ ప్రవీణ్ గూడూరు, కోశాధికారి గంగాధర్ వుప్పాల, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిరణ్ దుడ్డాగి, నేషనల్ కోఆర్డినేటర్ విజయ్ భాస్కర్ కలాల్, జాయింట్ ట్రెజరర్ వెంకట్ సుంకిరెడ్డి, కళావేదిక ప్రెసిడెంట్ స్వాతి అట్లూరి, సెక్రటరీ ఉజ్వల్ కుమార్ కస్తాల, ట్రెజరర్ రవీంద్రనాథ్ నిమ్మగడ్డ, ఈవెంట్స్ కోఆర్డినేటర్ రంజని ఉండవల్లి, ట్రస్టీ సాకేత్ చదలవాడ నిర్వహించారు. ఈ వేడుకలకు జితేందర్ రెడ్డి, ప్రదీప్ సామల, శ్రీ అట్లూరి, మాట ఈసీ మెంబర్స్, కార్యవర్గం, మాట న్యూజెర్సీ టీమ్ సహకరించారు. వేడుకల్లో వెంకీ ముస్టి, మాలిక్ రెడ్డి, క్రిష్ణ సిద్దాడ, కళ్యాణి బెల్లంకొండ, నరేందర్ ఎరనాగురి, పుర్ణా బేతపూడి తదితరులు పాల్గొన్నారు.
All Images Courtesy : Dr. Shiva Kumar Anand (Jaiswaraajya Tv & JSW Tv Global Director)
More Images : MATA Mother’s Day Celebrations at Albert Palace Edison NJ