Aishwarya Lekshmi : సత్యదేవ్ సరసన ‘గాడ్సే’లో నటించి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్, కేరళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి. ఈ సినిమాకు అంద ఆదరణ దక్కకపోవడంతో ఐశ్వర్య లక్ష్మి తెలుగు ప్రేక్షకులపై అలిగినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే అప్పటి నుంచి మళ్లీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంకో సినిమాలో కనిపించలేదు.
కానీ మలయాళం, తమిళ ఇండస్ట్రీలలో మాత్రం ఐశ్వర్య లక్ష్మికి మంచి క్రేజ్ హీరోయిన్ గా గుర్తింపు ఉంది. తెలుగులో చేసింది ఒక్క సినిమానే అయినా ఫ్యాన్స్ ను మాత్రం బాగా సంంపాదించుకుంది అమ్మడు. వారి కోసం సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఈ మధ్య ఆమె కొన్ని పిక్స్ ను సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది. రీసెంట్ గా గ్లామర్ డోస్ పెంచుతూ అదిరిపోయే పిక్స్ ను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మణిరత్నం కలల ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ లో ‘పొంగులుళి’ పాత్రలో ఐశ్వర్య కనిపించింది. మత్స యువతిగా ఆ తరహా గెటప్ తో అలరించింది. దీంతో పాటు ఇటీవల దుల్కర్ సల్మాన్ తో కలిసి ‘కింగ్ ఆఫ్ కొత్త’ చిత్రంలో కూడా ఐశ్వర్య లక్ష్మి కనిపించింది. ఆ తర్వాత మలయాళం ప్రాజెక్టులు ఉండడంతో అక్కడకు వెళ్లింది. వరుస సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది ఐశ్వర్య.
ఓపెన్ షోల్డర్స్ తో ఉన్న గౌన్ లో మత్తుగా ఎద అందాలను ప్రదర్శిస్తూ కవ్విస్తోంది. తాను కూడా గ్లామర్ పాత్రలు చెయ్యగలనని చెప్పకనే చేసింది. ఐశ్వర్య తెలుగులో నటించింది ఒక్కటే. కానీ చాలా వరకు డబ్బింగ్ సినిమాల్లో కనిపించింది. ప్రస్తుతం తమిళం ప్రాజెక్ట్ షూటింగ్ స్టేజీలో ఉండగా.. మలయాళం నుంచి కొన్ని ప్రాజెక్టులు చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది.
Breaking News