Railway దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెబుతోంది. ఇక మీదట చౌక ధరలకే ఆహారం అందించాలని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా రైల్వే అధికారులు ప్లాన్ చేస్తున్నారు. రూ. 20 లకే భోజనం, రూ. 50 లకే కాంబో మీల్స్ ఇచ్చేందుకు నిర్ణయించింది. దీంతో రైళ్లలో ప్రయాణించే వారికి అత్యంత తక్కువ ధరకే భోజనం అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది.
సరసమైన ధరలు, నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం అందించాలని చూస్తున్నారు. వీటికి తోడుగా వాటర్ బాటిల్ ను కూడా ఇవ్వనున్నారు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం సర్వీస్ (ఐఆర్ టీసీ) సహకారంతో రైల్వే స్టేషన్లలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. చౌక ధరలకే రైల్వే స్టేషన్లో భోజన సదుపాయం కల్పించనున్నారు.
మొదట హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, రేణిగుంట రైల్వే స్టేషన్లలో అందుబాటులోకి తెచ్చారు. ప్రయోగాత్మకంగా ఆరు నెలలు అమలు చేస్తారు. ఇందులో ఉండే లోటుపాట్లను సరిచేసుకుని ప్రయాణికుల నుంచి వస్తున్న స్పందనలకు అనుగుణంగా దశల వారీగా అన్ని రైల్వే స్టేషన్లలో తక్కువ ధరలకు భోజనం అందుబాటులోకి తీసుకువచ్చే ప్రణాళికలు రచిస్తున్నారు.
దక్షిణ ఇండియా ఆహార పదార్థాలను వినియోగంలోకి తీసుకురానున్నారు. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో చేపట్టనున్న దీనికి సంబంధించిన విధి విధానాలు త్వరలో వెల్లడి కానున్నాయి. దీంతో రైల్వే అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకోనున్నారు. ప్రయాణికులకు తక్కువ ధరలకే భోజనం అందించాలనే లక్ష్యంతో కార్యక్రమం రూపకల్పన చేస్తున్నారు.