Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా మీనాక్షి నటరాజన్ నియమితులయ్యారు. ప్రస్తుత ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ స్థానంలో ఆమెను నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ ఫిబ్రవరి 14, 2025న ఆదేశాలు జారీ చేశారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన మీనాక్షి నటరాజన్ 2009లో మాండసోర్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయి నుంచి ఎదిగి, రాహుల్ గాంధీకి సన్నిహితంగా ఉన్న ఆమె, ప్రస్తుతం ఆయన టీమ్‌లో కీలక సభ్యురాలిగా ఉన్నారు.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ను మార్చడం గమనార్హం. మీనాక్షి నటరాజన్ నియామకంతో, రాష్ట్రంలో పార్టీ శక్తిని మరింత బలోపేతం చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆశిస్తోంది