
APTS Chairman Mannava Mohana Krishna : ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీస్(ఏపీటీఎస్) ఛైర్మన్ గా మన్నవ మోహన కృష్ణ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి అమెరికా పర్యటనకు వచ్చారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని న్యూజెర్సీలో రాబర్ట్ ఆల్బర్ట్ ప్యాలెస్ లో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు.

గత 15 సంవత్సరాలుగా మన్నవ మోహన కృష్ణ గారు న్యూజెర్సీలో ఏం ఫంక్షన్ చేసినా.. తెలుగుదేశం పార్టీ కార్యక్రమమైనా తను వెన్నంటి ఉండి ప్రతీ కార్యక్రమానికి హాజరవుతుంటాడు. తెలుగుదేశం తరుఫున ఏ కార్యక్రమం జరిగినా తను కవరేజ్ చేసేవారు. బాలయ్య బాబు ఎప్పుడు వచ్చినా సరే..సినిమా పరంగా కానీ.. రాజకీయ కార్యక్రమాలు కానీ.. బసవతారం ఆస్పత్రికి నిధుల సేకరణకు కానీ ముందుండి కార్యక్రమాన్ని విజయవంతం చేసేవారు. ధర్నాలు, నిరసనలు, టీడీపీ నిర్వహించే పోరాటాల్లో మన్నవ గారు ముందుడి నడిపిస్తారు.
పార్కుల్లో కారు ర్యాలీలు కవర్ చేసేవారు. ఏపీ టీఎస్ చైర్మన్ గా మన్నవ గారు కావడంతో అందరూ హర్షం వ్యక్తంచేశారు.ఆయన తన 15 ఏళ్ల రాజకీయ జీవితంలో జ్ఞాపకాలన్నీ పంచుకున్నారు. తర్వాత ఒక చైర్మన్ నే కాదు.. భవిష్యత్తులో పైకి ఎదగాలని.. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవులు పొందాలని ఆశిస్తూ మన్నవ గారి సేవలను అందరూ గుర్తుచేసుకున్నారు.
జనవరి 10న రాత్రి 7గంటల సమయంలో నిర్వహించిన మన్నవ మోహన కృష్ణ తో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని ఎన్ఆర్ఐలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో Jaiswaraajya Tv & JSW TV Global Director శివ కుమార్ ఆనంద్.. ఏపీటీఎస్ ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కాసేపు ముచ్చటించారు.ఈ 15 సంవత్సరాలు ఆ మన్నవ గారి వెంట ఉండి ఆయనను ప్రోత్సహిస్తూ ఆయన చేసే ప్రతి కార్యక్రమాన్ని డా.శివ కుమార్ ఆనంద్ గారు ఈ 15 సంవత్సరాలు వెన్నంటి ఉండి ప్రోత్సాహిస్తూ ఆయనకు చేదోడు వాదోడుగా ఉన్నారు.
ఏపీటీఎస్ ఛైర్మన్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం అట్టహసంగా జరగడంపై ఎన్ఆర్ఐలు సైతం సంతోషం వ్యక్తం చేశారు.
All Image Credit : Dr. Shiva Kumar Anand (Jaiswaraajya Tv & JSW TV Global Director)
More Images : Meet & Greet with Mannava Mohana Krishna