Meet and Greet : అమెరికాలోని ఇండియన్ కమ్యూనిటీ ఏర్పాటు చేసిన సంస్థలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ నార్త్ అమెరికా (ICONA) లాల్ బహదూర్ శాస్త్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఏర్పాటు చేయనుంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ శ్రీ అనిల్ శాస్త్రిజీ పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 27వ తేదీన నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ద రాయల్ ఆలబర్ట్స్ ప్యాలెస్ (నీల్ కమల్ హాల్), 1050 కింగ్ జార్జ్స్ పోస్ట్ రోడ్.. ఫోర్డ్స్, న్యూ జెర్సీ 08863లో సాయంత్రం 6.30 గంటలకు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అమెరికాలోని ఇండియన్స్, తెలుగు వారు అందరూ పాల్గొనాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో దివంగత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి రెండో కుమారుడు అయిన అనిల్ శాస్త్రి జీ ప్రసంగం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. 1989లో ఆన వారణాసి లోక్ సభ ఎంపీగా ఎన్నికయ్యాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా కొనసాగారు.
భారతదేశంలో ప్రస్తుత పరిస్థితులు, ప్రపంచంలో ఇండియన్స్ స్థానం దేశం కొరకు మనం చేయాలి లాంటి వాటి గురించి అనిల్ శాస్త్రి మాట్లాడనున్నారు. దీంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి కూడా ఆయన మాట్లాడనున్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐలతో పాటు ప్రతీ ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.