29.9 C
India
Wednesday, September 16, 2026
More

    Mega family chose Lavanya Tripathi as daughter-in-law and that’s why.. shocking truth : మెగా ఫ్యామిలీ లావణ్య త్రిపాఠిని కోడలుగా ఎంచుకుంది అందుకే.. షాకింగ్ నిజం

    Date:

     

     

    Mega family chose Lavanya Tripathi as daughter-in-law and that’s why.. shocking truth : ఇప్పుడు సినీ అభిమానులు, మెగా ఫ్యాన్స్ ఎక్కువగా సెర్చ్ చేసే పేరు లావణ్య త్రిపాఠి. మెగా బ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ తో ఎంగేజ్‌మెంట్ అయ్యాక ఆమె గురించి మరింత ఎక్కువ తెలుసుకుంటున్నారట. 2016లో మిస్టర్ సినిమా నుంచి ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నిన్న (జూన్ 9వ తేదీ) ఉంగరాలు మార్చుకొని మరో అడుగు ముందుకు వేసింది ఈ జంట. ఇంతటి మెగా ఇంటికి కోడలు అవుతున్న త్రిపాఠి ఫ్యామిలీ గురించి తెలుసుకునేందుకు ఎక్కువగా ఉత్సాహం చూపుతున్నారు. ఆమె ఎప్పుడు పుట్టింది.. జన్మ నక్షత్రం.. ప్రాంతం.. తల్లిదండ్రులు.. ఇలా ప్రతీ విషయం తెలుసుకుంటున్నారు.

    ఆమె ఒక సాధారణ కుటుంబానికి చెందింది. 15 డిసెంబర్, 1995లో ఉత్తరప్రదేశ్, ఫైజాబాద్ లో పుట్టింది. డెహ్రాడూన్ లో చదువుకుంది. ఆమె తండ్రి హై కోర్టు లావర్, తల్లి ఉపాధ్యాయురాలు. ఆమెకు సోదరి, సోదరుడు ఉన్నారు. ఇందులో సోదరి కమిషనర్ గా పని చేస్తుంది.  సినిమాల్లో మంచి స్టార్ అవ్వాలని చిన్నతనం నుంచే కోరుకునేది. డిగ్రీ దయారామ్ నేషన్ కాలేజీలో చేసింది. ఈ తర్వాత మోడలింగ్ రంగంలోకి వెళ్లింది. ‘మిస్ ఉత్తరాఖండ్-2006’ను గెలుచుకుంది. శాస్త్రీయ నృత్యంలో కూడా ఆమెకు పట్టు ఉంది. దీంతో ఆమె అడుగులు మెల్ల మెల్లగా బుల్లితెర అటునుంచి వెండితెర వైపు పడ్డాయి. బుల్లితెరపై హీందీలో ‘ప్యార్ కా బంధన్’ అనే టీవీ షోలో నటించింది. ఆ తర్వాత 2012లో ‘అందాల రాక్షసి’తో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో క్యూట్ గా పర్ఫార్మ్ చేసిన ఆమె నటన ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది.

    ‘మిస్టర్’ మూవీలో లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ సరసన నటించింది. 2016లో షూటింగ్ జరిగిన ఈ మూవీ 2017లో విడుదలైంది. షూటింగ్ కొంత భాగాన్ని ఇటలీలో జరిగింది. ఆ సమయంలోనే ఇద్దరి మధ్యా ప్రేమ పుట్టింది. అది కాస్తా ప్రేమగా మారి నిశ్చితార్థం వరకు తీసుకెళ్లింది. ఏడేళ్ల బంధం ఏడు అడుగులతో ఏడు జన్మలు కలిసే ఉండాలని ఆమె హింట్ ఇస్తూ నిశ్చితార్థం ఫొటోలు ట్విటర్ లో పెట్టింది లావణ్య త్రిపాఠి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    మెగా కుటుంబం షరతులను లావణ్య అంగీకరించిందా?

        మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిఫాఠి నిశ్చితార్థం శుక్రవారం జరిగింది....

    మెగా కోడలు లావణ్య త్రిపాఠి బ్యాగ్రౌండ్ తెలుసా..?

      మెగా బ్రదర్ నాగబాబు కోడలిగా వస్తున్న లావణ్య త్రిపాఠి గురించి తెలుసుకునేందుకు...