
Mega Family : మెగా ఫ్యామిలీలో జోరుగా పెళ్లి చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది.. ఒకరి తర్వాత మరొకరు పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ విషయం తెలుసుకుని మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.. ఇటీవలే మెగా హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠీని ఎంగేజ్మెంట్ చేసుకుని ఒక ఇంటి వాడు కాబోతున్న విషయం తెలిసిందే..
ఇక ఇప్పుడు మరో మెగా హీరో సాయి తేజ్ కూడా పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది.. వరుణ్ తేజ్ పెళ్లి అయిన వెంటనే సాయి ధరమ్ తేజ్ పెళ్లి చేయాలని సాయి తేజ్ తల్లి డిసైడ్ అయ్యారట.. అందుకే ఈయనకు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారని సమాచారం.. రీసెంట్ గానే సాయి తేజ్ తల్లి ఒక డాక్టర్ ను రెండవ పెళ్లి చేసుకున్నారు.
మరి ఇప్పుడు ఆమె భర్త స్నేహితుడి కూతురు కూడా ఒక డాక్టర్ అని ఆమెతోనే సాయి తేజ్ పెళ్లి చేయాలని అనుకుంటుందని టాక్.. అమ్మాయి కుటుంబం కూడా ఆర్ధికంగా ఉన్నవారు కావడం అందులోనే తమ వారే కావడంతో ఆ సంబంధమే బాగుంటుందని విజయదుర్గ ఆలోచన అని తెలుస్తుంది.
ఈ విషయం మీద చిరంజీవి గారితో కూడా చర్చించినట్టు తెలుస్తుంది. సాయి తేజ్ వయసు ఇప్పుడు 36 ఏళ్ళు కావడంతో ఇంకా వెయిట్ చేయకుండా పెళ్లి చేయాలని ఆమె చూస్తుందని ఈ సంబంధం గురించి ఇరు కుటుంబాల మధ్య చర్చలు నడుస్తున్నట్టు టాక్.. చూడాలి సాయి తేజ్ ఎవరిని పెళ్లి చేసుకుంటాడో..
|
ReplyForward
|






