“Bhola Shankar” review and rating : మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుంది అంటే మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు సాధారణ ఆడియెన్స్ సైతం ఎంతో ఎగ్జైట్ అవుతారు.. ఆయన సినిమాను మొదటి రోజే చూడాలని ముందుగానే ఫుల్ ప్రిపేర్ అవుతుంటారు.. మరి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని అందరు ఆశ పడుతుంటారు.. అందులోను ఈ మధ్య మెగాస్టార్ వరుస హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు..
వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ నటించిన లేటెస్ట్ మూవీ ”భోళా శంకర్”.. స్టైలిష్ డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ చిరు సోదరిగా నటించింది.. ఈ సినిమా ఈ రోజు ఆగస్టు 11న థియేటర్స్ లో ఆడియెన్స్ ను అలరించడానికి రెడీ అయ్యింది.. మరి ఈ సినిమా రివ్యూ ఇప్పుడు చూద్దాం..
నటీనటులు :
మెగాస్టార్ చిరంజీవి
తమన్నా
కీర్తి సురేష్
సుశాంత్
రఘుబాబు
రావు రమేష్
వెన్నెల కిషోర్
రష్మీ గౌతమ్, సత్య
గెటప్ శ్రీను తదితరులు..
డైరెక్టర్ : మెహర్ రమేష్
నిర్మాత సుంకర రామబ్రహ్మం
మ్యూజిక్ డైరెక్టర్ : మహతి స్వర సాగర్
కథ :
చిరంజీవి, కీర్తి సురేష్ అన్నాచెల్లెళ్లు.. వీరు కోల్ కత్తాలో నివసిస్తుంటారు.. అక్కడ ఒక గ్యాంగ్ అందరిని ఇబ్బంది పెడుతుంటారు.. ఈ క్రమంలోనే తమన్నా సోదరుడు సుశాంత్ తో కీర్తి సురేష్ లవ్ లో పడుతుంది.. ఒకవైపు వీరి లవ్ ట్రాక్, మరో వైపు చిరు ఆ అమ్మాయిలను కిడ్నాప్ చేసే గ్యాంగ్ ఆట ఎలా కట్టించాడు అనేది మిగిలిన కథ..
విశ్లేషణ :
భోళా శంకర్ తమిళ్ లో 2015లో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే.. ఈ సినిమా కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసారు. భోళా శంకర్ లో చెల్లెలు సెంటిమెంట్ ఆకట్టుకుంది.. ఫ్లాష్ బ్యాక్ కూడా చూపించారు.. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీతో సాగగా సెకండాఫ్ సీరియస్ గా సాగుతుంది.. ఫస్ట్ హాఫ్ కంటే సెకండాఫ్ హైలెట్ అనే చెప్పాలి.
పర్ఫార్మెన్స్ :
మెగాస్టార్ నటన గురించి చెప్పాల్సిన పని లేదు.. అయితే కొన్ని ఫైట్ సీన్స్ ఆకట్టుకున్న మరికొన్ని మాత్రం గ్రాఫిక్స్ అని తెలిసిపోతుంది. కీర్తి, సుశాంత్ తమ పాత్రలకు తగ్గట్టుగా బాగానే అలరించారు.. కీర్తి చెల్లెలి రోల్ లో శ్రీముఖి అలరించింది. తమన్నా రోల్ పరంగా ఇంపార్టెన్స్ లేకపోయినా సాంగ్స్ లో అలరించింది.
ఇక మెహర్ రమేష్ పర్వాలేదనిపించారు.. ఇంకాస్త సాన పెట్టివుంటే బాగుండేది అనిపించింది. రొటీన్ సీన్స్ తో ఫస్ట్ హాఫ్ లో బోర్ కొట్టించాడు.. ఎప్పటివో సీన్స్ ను ఇప్పుడు వాడినట్టు అనిపించింది.. పాటలు ఒకటి రెండు మినహా పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి.. అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మహతి అలరించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి..
చివరిగా.. మొత్తంగా సినిమా కొంచెం ఇష్టం.. కొంచెం కష్టంగా సాగుతుంది అనే చెప్పాలి..
రేటింగ్ : 2.5/5