మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య 250 కోట్లకు పైగా వసూళ్లను సాధించడంతో ఒక్కసారిగా తన రెమ్యునరేషన్ ను పెంచాడు. ఇకపై ఒక్కో సినిమాకు 100 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాడట. ఇన్నాళ్లు మెగాస్టార్ చిరంజీవి 50 కోట్ల లోపు మాత్రమే రెమ్యునరేషన్ అందుకున్నాడు. వాల్తేరు వీరయ్య కోసం 50 కోట్లు అందుకున్నాడు. ఈ సినిమా ఏకంగా 250 కోట్లు వసూల్ చేయడంతో అమాంతంగా తన రెమ్యునరేషన్ పెంచాడట.
అయితే వాల్తేరు వీరయ్య సమయంలోనే భోళా శంకర్ చిత్రాన్ని ఓకే చేసాడు కాబట్టి ఆ సినిమాకు కూడా 50 కోట్లు మాత్రమే తీసుకుంటున్నాడు. అయితే దాని తర్వాత చేయబోయే సినిమాలకు మాత్రం ఒక్కో సినిమాకు 100 కోట్ల రెమ్యునరేషన్ అందుకోబోతున్నాడట. గాడ్ ఫాదర్ చిత్రం మొత్తమే 100 కోట్ల గ్రాస్ మాత్రమే వసూల్ చేయగా వాల్తేరు వీరయ్య మాత్రం 250 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.
జనవరి 13 న విడుదలైన వాల్తేరు వీరయ్య చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. పరమ రొటీన్ కథ అయినప్పటికీ యాక్షన్ , సెంటిమెంట్ , ఎంటర్ టైన్ మెంట్ పుష్కలంగా ఉండటంతో బ్లాక్ బస్టర్ అయ్యింది. దాంతో విభిన్న కథా చిత్రాల కంటే నాటు సినిమాలే మేలని భావిస్తున్నాడట మెగాస్టార్.