Megastar Chiranjeevi :
టాలీవుడ్ లో తిరుగులేని మాస్ హీరో మెగాస్టార్ చిరంజీవి. దాదాపు మూడు దశాబ్దాలుగా తెలుగుతెరపై నంబర్ వన్ గా చెలామణి అవుతున్నారు. రాజకీయాల్లోకి వెళ్లి కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్నా మళ్లీ తెరపైకి వచ్చి తన స్టార్ డమ్ కు తిరుగులేదని నిరూపించుకున్నారు. వరుస సినిమాలతో తన తరం హీరోలతో పాటు ఇప్పటిక యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్నారు. తన కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలో ఎలాగైతే వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లాడో ఇప్పుడు అలాగే కంటిన్యూ అవుతున్నాడు.
అయితే చాలా రోజుల క్రితం రచయిత వెలిగొండ శ్రీనివాస్ రాసిన కథ చిరుని ఆకట్టుకున్నది. తండ్రి తన కొడుక్కి పెళ్లి చేయాలనుకొంటే, కొడుకేమో తండ్రికే పెళ్లి చేయాలనేది కాన్సెప్ట్. ఈ కథతో రెబల్ స్టార్ కృష్ణంరాజు, శ్రీకాంత్ కాంబినేషన్ లో ‘మా నాన్నకి పెళ్లి’ సినిమా వచ్చింది. సేమ్ ఇదే లైన్ తో అప్పట్లో ఆయన అనుకొన్న హీరోలు నాగబాబు, తరుణ్. తండ్రిగా నాగబాబు, కొడుకుగా తరుణ్ ను ఎంచుకున్నారు. కథ కూడా ఫైనల్ అయిపోయింది. కానీ షూటింగ్ మొదలు పెట్టే సమయానికి సినిమా ఆగిపోయింది. మళ్లీ ఇలాంటి కథ తో ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నది. ప్రసన్న కుమార్ బెజవాడ రాసిన `మా నాన్నకు పెళ్లి` లాంటి కథ మెగాస్టార్ బాగా నచ్చిందని, కల్యాణ్ కృష్ణ డైరెక్షన్ చేనున్నట్లు తెలుస్తున్నది. మెగా స్టార్ చిరంజీవి హీరో కాగా, ఆయన తనయుడిగా సిద్దు జొన్నలగడ్డ నటించనున్నాడని టాక్. చిరంజీవికి జోడిగా త్రిష, సిద్దూకు జోడిగా శ్రీలీల నటించనున్నారని సమాచారం. ఆగస్టులో ఈ సినిమా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అప్పట్లో నాగబాబు కోసం అనుకొన్న లైన్ ఇదేనని, ప్రస్తుతం చిరుకు తగ్గట్లుగా మార్పులు చేసి చిత్రీకరణ మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారని టాలీవుడ్ టాక్. అయితే.. వెలిగొండ శ్రీనివాస్ రాసుకొన్న కథకీ, ఇప్పుడు ప్రసన్న కుమార్ బెజవాడ రాసిన కథకూ ఏమైనా సింక్ అవుతుందా అనే సందేహం నెలకొంది. అయితే దీనికి ఆ రచయితల నుంచే సమాధానం రావాల్సి ఉంది.