Megastar Chiranjeevi : ప్రస్తుతం రాష్ట్రపతి కోటాలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. జూలై 14న ఖాళీ అయిన ఈ స్థానాలను జనవరి 14లోపు పూరించాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఒక స్థానానికి మెగాస్టార్ చిరంజీవి గారి పేరు కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే చిరంజీవి ఇద్దరు తముళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రీయాశీలకంగా వ్యవహరించారు. పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబుకు త్వరలోనే మంత్రి పదవీ దక్కబోతుంది. కాగా గతంలోనూ మెగాస్టార్ కి రాజ్యసభ సీటు ఇస్తారనే ప్రచారం జరిగింది. అయితే దానిని ఆయన సున్నితంగా తిరస్కరించారు.
తాజాగా మరోసారి రాష్ట్రపతి కోటాలో ఆయనను కేంద్రంలోని బీజేపీ రాజ్యసభకు పంపుతుందనే ప్రచం జరుగుతోంది. మరీ ఈసారైనా చిరంజీవి రాజ్యసభ సీటును తీసుకుంటారా? లేదా అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.