
Meme Famous Review : సుమంత్ ప్రభాస్ యూట్యూబ్ అండ్ వెబ్ సిరీస్ లతో ఇప్పటికే మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు.. ఇక ఇప్పుడు సుమంత్ ప్రభాస్ డైరెక్టర్ గా మారిపోయి ‘మేమ్ ఫేమస్’ అనే సినిమాను తెరకెక్కించాడు.. ఈ సినిమాలో ఆయనే హీరోగా కూడా నటించి తెరకెక్కించాడు.. యూత్ ఫుల్ విలేజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్ర మనోహరన్ నిర్మించగా.. కిరణ్ మచ్చ, అంజిమామా, నరేంద్ర రవి, మురళీధర్ గౌడ్ శివ నందన్ తదితరులు నటించారు.. ఈ రోజు థియేటర్స్ లో అలరిస్తున్న ఈ సినిమా రివ్యూ ఒకసారి చూద్దాం..
కథలోకి వెళ్తే..
ఈ సినిమా కథ తెలంగాణ నేపథ్యంలో సాగుతుంది.. బంధనర్సంపల్లి అనే గ్రామంలో ముగ్గురు చిన్ననాటి స్నేహితులు నివసిస్తున్నారు.. మై, బాలి, దుర్గ.. కాగా వీరిలో మై మౌనికను, బాలి బబ్బిని ప్రేమిస్తారు.. ఆ తర్వాత వారి ప్రేమను గెలిపించు కోవాలంటే సంపాదన కావాలి కాబట్టి వారు ఫేమస్ అవ్వాలని నిర్ణయించుకుంటారు.. మరి అందుకోసం వీరి ఏం చేసారు అనేది ఈ కథ.
నటీనటుల పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే..
సుమంత్ ప్రభాస్ నటన, యాటిట్యూడ్ బాగా ఆకట్టుకుంటాయి.. తన టాలెంట్ ను బాగా ఎలివేట్ చేసాడు.. అలాగే హీరో ఫ్రెండ్ పాత్రల్లో మనీ, మౌర్య కూడా బాగా నటించగా మిగతా వారు బాగా ఆకట్టుకున్నారు.
టెక్నీకల్ గా ఎలా ఉందంటే..
సుమంత్ ప్రభాస్ ఎంచుకున్న కంటెంట్ లో కొత్తగా ఏమీ లేదు.. ఆయన చెప్పదలుచుకున్న కథ బాగానే చెప్పిన ఏదో మిస్ అయ్యింది అని ఆడియెన్స్ కు అనిపిస్తుంది.. కొన్ని కొన్ని సీన్స్ మధ్యలో దూర్చినట్టు కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది.. స్క్రీన్ ప్లే అయితే సరిగా లేదు.. పాటలు, ఎడిటింగ్ మరింత మెరుగ్గా ఉంటే బాగుండేది.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది..
ప్లస్ పాయింట్స్ :
యూత్ ఫుల్ సీన్స్
సుమంత్ ప్రభాస్ నటన
మైనస్ పాయింట్స్ :
సెకండాఫ్ లాగ్
స్క్రిప్ట్ లో కొత్తదనం లేకపోవడం
చివరిగా చెప్పేది ఏంటంటే..
ఇది యువతకు ఇష్టమైన సినిమాలా అనిపించదు.. ఒక షార్ట్ ఫిలిం చూసినట్టు అనిపిస్తుంది. తెలంగాణ నేపథ్యం కొంత ఆకట్టుకుంది. కానీ మరింత కొత్త కథతో వస్తే ఈ సినిమా బాగా హిట్ అయ్యేది.. కాలీగా ఏదో ఒకటి చూసెయ్యాలి అనుకునే వారు ఒకసారి చూడవచ్చు..
రేటింగ్ : 2/5