
Memes on Floods :
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అత్యంత దయనీయ పరిస్థితి నెలకొంది. ప్రజలు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు..ఈ నేపథ్యంలో నీట మునిగిన ప్రాంతాలపై సోషల్ మీడియాలో పలు మీమ్స్ ఆకట్టుకుంటున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే అటు రియల్టర్ల ఆగడాలను దుమ్మెత్తి పోస్తున్నారు. అపార్ట్ మెంట్లు, విల్లాలు, అద్భుతంగా నిర్మించామంటూ వారు చేస్తున్న దందాలను ఎత్తిచూపుతూ ఈ సెటైర్లు పేలుతున్నాయి. ప్రభుత్వం, అధికారుల పనితీరుకు ఇవి అద్దం పడుతున్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంత జరిగినా తీరు మారడం లేదని, ప్రతి ఏడాది ఇదే పరిస్థితి ఎదురవుతున్నదని మండిపడుతున్నారు. నీట మునిగిన బిల్డింగులు, నిర్మాణాలను పోస్టులుగా సోషల్ మీడియాలో పెడుతున్నారు.
ఇక వాహనాల్లో ప్రయాణం అవసరం లేదని ఓడలు వేసుకొని తిరిగితే డీజిల్ ఖర్చు మిగులుతుందని సెటైర్లు వేస్తున్నారు. రివర్ వ్యూ బిల్డింగ్ అంటే మరీ ఇంతలా నీటితో ముంచేయాలా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు..వరదలో నిరాశ్రయులుగా మిగిలిన వారి ని చూపిస్తూనే, ప్రభుత్వ వైఫల్యాలతో పాటు రియల్టర్ల ఆగడాలను పోస్టుల రూపంలో పెడుతూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వాలకు బుద్ధి రావడం లేదంటూ అధికారుల తీరును ఎండగడుతున్నారు తెలంగాణలో వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. వీటన్నింటిని సోషల్ మీడియాలో పెడుతూ వరదల్లో ముంచెత్తిన ప్రాంతాల ఫొటోలను అప్ లోడ్ చేస్తూ పోస్టులు పెడుతూ సెటైర్ల రూపంలో ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. అయితే సోషల్ మీడియాలో ఈ మీమ్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతి ఒక్కరూ వీటిని షేర్ చేస్తూ, కామెంట్లు పెడుతున్నారు. ఫ్లాట్ ఫర్ సేల్.. వానకాలంలో చూడండి.. ఎండాకాలంలో కొనండి అనే మీమ్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి. అయితే వీటిని సరదాగా చేస్తున్నా, ప్రభుత్వం తీరను ఎత్తి చూపినట్లే కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పాలన ఇంత చెత్తలా ఉందని, దీనికే డల్లాస్, న్యూయార్క్ అంటూ జబ్బలు చరుచుకుంటున్నారని మండిపడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వ తీరుపై వస్తున్న ఈ ట్రోల్స్ తీవ్రంగా వైరల్ అవుతున్నాయి.|
ReplyForward
|






