
Monsoon Report : రోహిణి కార్తె కొనసాగుతోంది. అందుకే సూర్యుడు తన ప్రతాపం చూపెడుతున్నాడు. ఈ నెల (మే) 25 నుంచి కాలు బయటకు పెట్టాలంటేనే జంకుతున్నారు ప్రజలు. ఇర జనం చూపు నైతురి రుతుపనాలపైనే పడింది. అవి ఎప్పుడు వస్తాయా..? ఎప్పుడు వాతావరణం చల్లబడుతుందా..? అంటూ ఎదురు చూస్తున్నారు. అయితే దీనిపై ఇండియా మెటరలాజికల్ డిపార్ట్ మెంట్ (IMD) క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఏమందంటే..
నైరుతీ రుతుపవనాలు ప్రసత్తుం అండమాన్ నికోబాద్ దీవులపై విస్తరుస్తున్నాయి. ఈ తరుణంలో ఏ సారి వర్షాలు ఎలా ఉంటాయన్న దానిపై వాతావరణ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం మాత్రమే నమోదవుతుందని తెలిపింది. ఇక ఇండియాలో జూన్ నెల నుంచి సెప్టెంబర్ వరకూ వానాకాలం ఉంటుందని తెలిపింది. ఈ నెలల మధ్యలోనే దేశ వ్యాప్తంగా 96 శాతం నుంచి 104 శాతం వరకూ వానలు ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది.
మామూలుగా నైతే మే 30 నుంచి లేదా జూన్ 1వ తేదీ వరకే నైరుతి రుతుపవనాలు తీరాన్ని తాకుతాయి. ఈ సారి కాస్త ఆలస్యమైంది. జూన్ 4వ తేదీన తీరాన్ని తాకుతాయని ఐఎండీ స్పష్టం చేసింది. అంటే 4 రోజులు ఆలస్యమైందన్నమాట. కేరళ నుంచి ముందుగా గోవా వైపు విస్తరిస్తూ తర్వాత తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తాయి. ఈ ప్రక్రియకు కనీసం వారం పడుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీని ప్రకారం చూస్తే జూన్ 10వ తేదీ తర్వాతే తెలుగు రాష్ట్రాలు కూల్ అవుతాయన్నమాట. ఇక అప్పుడే వర్షం పడదు. రుతుపవనాలు విస్తరించేందుకు మరో 2 నుంచి 3 రోజులు పడుతుంది. దీని లెక్క ప్రకారం చూస్తే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడాలంటే 13వ తేదీ వరకు పడుతుంది.
ఈ సారి వాయువ్య భారత్ లో వర్షాలు 92 శాతం కంటే తక్కువగానే కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. మిగతా దేశంలో బాగానే కురుస్తాయని చెప్పింది. ఎల్ నినో కారణంగా జూన్ లో వర్షాలు తక్కువగానే కురుస్తాయని అంటున్నారు. ఈ రుతుపవనాలు వచ్చే సమయంలో అరేబియా మహా సముద్రంలో ఎటువంటి కాల్లోలం రావద్దని ఒక వేల వస్తే రుతుపవనాల కదలికల్లో తేడా రావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సారి అరేబియా ఎటువంటి కదలికలు లేకుండా ఉందని ఇది మంచి పరిణామం అంటున్నారు.