
monsoons : నైరుతి రుతుపవనాలు రానున్నాయి. త్వరలో రాష్ట్రాన్ని తాకనున్నాయి. దీంతో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఇన్నాళ్లు ఎండలతో బెంబేలెత్తుతున్న జనానికి ఇది తీపి కబురే. ఈ సంవత్సరం కూడా రుతుపవనాలు ముందే రానున్నాయి. వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారంతో ఇక వర్షాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.
జూన్ మొదటి వారంలో రుతుపవనలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. మే 20 నాటికి అండమాన్ తీరాన్ని రుతుపవనాలు ముందుగానే తాకాయి. మరో వారం రోజుల్లో జూన్ 3 నాటికి ఇవి కేరళను తాకే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అంచనాలతో వానలు కురుస్తాయని చెబుతున్నారు.
బంగాళాఖాతంలో వారం రోజుల పాటు మహాసేన్ తుపాన్ ఏర్పడే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలకు తోడు తుపాన్ రావడంతో వర్షాలు ముందే వస్తాయని అంటున్నారు. గత ఏడాది జూన్ 5న కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు జూన్ రెండో వారంలో విస్తరించనున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు 45-47 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ కీలక సమాచారం ఇవ్వడంతో ఉపశమనం దక్కనుంది. రోహిణి కార్తె నేడు ప్రవేశించడంతో ఇక వర్షాలు ఎప్పుడు వస్తాయో అని చూస్తున్నారు.