24.9 C
India
Friday, March 1, 2024
More

  Hyundai Exter SUV : 27 కిమీల మైలేజ్.. సేఫ్టీ ఫీచర్లలో నెం.1.. రూ. 7 లక్షల ఎస్‌యూవీని ఇంటికి తెచ్చుకోండి!

  Date:

  Mileage of 27 km.. No. 1 in safety features..
  Mileage of 27 km.. No. 1 in safety features..

  Hyundai Exter SUV : కార్ల కంపెనీలు భారత మార్కెట్ లో ఒకదాని తర్వాత ఒకటి కాంపాక్ట్ SUVలను రిలీజ్ చేస్తున్నాయి. టాటా నెక్సాన్, హ్యుందాయ్ క్రెటా, మారుతి బ్రెజ్జా వంటి అనేక కార్లు ఇందలో తమ ఆధిపత్యాన్ని చాటుతున్నాయి. అదే సమయంలో, ఇప్పుడు మినీ SUVలు కూడా కాంపాక్ట్ లు కూడా SUVల కంటే చిన్న విభాగంలో ఆదరణ పొందుతున్నాయి. సామాన్యుల బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకొని కార్ల కంపెనీలు హ్యాచ్‌ బ్యాక్‌ల ధరలో వీటిని విడుదల చేస్తున్నాయి.

  ఇప్పుడు మీరు రూ.6 లక్షల నుంచి రూ. 7 లక్షల బడ్జెట్‌లో కూడా మినీ SUVని పొందవచ్చు. దీంతో హ్యాచ్‌బ్యాక్ కార్ల విక్రయాలు కూడా తగ్గుముఖం పట్టాయి. బేస్ మోడల్ నుంచి చాల మంచి ఫీచర్లతో వస్తున్న మినీ SUV గురించి తెలుసుకుందాం.

  హ్యుందాయ్ మోటార్ ఇండియా తక్కువ బడ్జెట్‌లో ఎస్‌యూవీ కోరుకునే వారి కోసం గతేడాది  ఎక్స్‌టర్‌ను విడుదల చేసింది. టాటా పంచ్‌కు పోటీగా కంపెనీ దీన్ని మార్కె్ట్ లోకి పంపింది. దీనికి ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ. డిజైన్ పరంగా కూడా విపరీతమైన ఆదరణ పొందుతోంది. తక్కువ బడ్జెట్‌లో అందుబాటులో ఉండడంతో, ప్రజలు హ్యాచ్‌బ్యాక్‌కు బదులుగా ‘ఎక్సెటర్‌’ కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఈ SUV మధ్య తరగతికి హ్యాచ్‌బ్యాక్ కంటే మెరుగైనదిగా ఉంటుంది.

  బేస్ మోడల్‌లో చాలా ఫీచర్లు..
  ఈ SUVలో, కస్టమర్ల భద్రతపై కంపెనీ శ్రద్ధ తీసుకుంది. బేసిక్ వేరియంట్‌లో కూడా అనేక ఫీచర్లను ఇచ్చింది. డ్యూయల్ కెమెరా డాష్‌ క్యామ్, 6 ఎయిర్‌ బ్యాగ్స్, ఆటో మేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, టీపీఎంఎస్, త్రీ పాయింట్ సీట్‌ బెల్ట్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంచింది. ఇవి అన్ని వేరియంట్లలో ప్రామాణికంగా ఉంటాయి. ఈ కారులో 60కి పైగా కనెక్ట్ చేసిన ఫీచర్లు ఉన్నాయి. వాయిస్ ఎనేబుల్డ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో అందించిన మొదటి కారు ఇది.

  ఇంజిన్‌..: హ్యుందాయ్ ఎక్సెటర్‌లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో నడుస్తుంది. ఈ ఇంజిన్ 6000 rpm వద్ద 81 bhp శక్తి, 4000 rpm వద్ద 114 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. కంపెనీ దీన్ని CNG వెర్షన్‌లో కూడా తెచ్చింది. CNGలో ఇంజిన్ 68 BHP పవర్, 95 Nm టార్క్ ప్రొడ్యూస్ చేయగలదు. పెట్రోల్ వేరియంట్‌లో ఎక్సెటర్ మైలేజ్ 19.4kmpl కాగా, CNGలో 27.1 km/kg ఇవ్వగలదు.

  ధర..?: హ్యుందాయ్ ఎక్సెటర్ EX, EX(O), SX, SX(O), S, S(O), SX(O) 7 వేరియంట్లలో ఉంది. దీనిపై కంపెనీ మూడేళ్ల అపరిమిత కిలో మీటర్ల వారంటీ ఇస్తుంది. ఏడేళ్ల పొడిగించిన వారంటీ ఎంపిక కూడా ఉంది. ఈ మైక్రో SUV 6 మోనోటోన్, త్రీ డ్యూయల్ టోన్ ఎక్ట్సీరియర్ పెయింట్‌లో లభిస్తుంది. హ్యుందాయ్ ఎక్సెటర్ ధరలు రూ. 6 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి రూ. 10 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతాయి.

  Share post:

  More like this
  Related

  Neha Shetty : నేహా శెట్టి వారణాసి ఘాట్‌లు & గ్రేస్‌ని ఆలింగనం చేసుకుంది

  Neha Shetty : డీజే టిల్లుతో ఓవర్ నైట్ స్టార్...

  JaganVadina : పవన్ పెళ్లిళ్లపై జగన్ కు ఎందుకు? #JaganVadina ట్రెండింగ్ తో ప్రశ్నిస్తున్న జనసేన నాయకులు

  JaganVadina : మొన్నటికి మొన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం...

  Increasing VIPs : దేశంలో పెరిగిపోతున్న వీఐపీ, వారి ఖర్చు.. ఇతర దేశాల్లో ఎంతంటే?

  Increasing VIPs : -బ్రిటన్‌లో అధికారికంగా 84 మంది వీఐపీలు ఉన్నారు! -ఫ్రాన్స్‌లో...

  Frogs Marriage : కప్పలకు పెళ్లెందుకు చేస్తారో తెలుసా? దీని వెనకున్న కథ ఇదీ..

  Frogs Marriage Behind Story : భారత్ లో ఇప్పటికీ వివిధ...

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  Hyundai Exter SUV : ఈ కారు.. ఇప్పుడు హాట్ కేక్

  Hyundai Exter SUV లాంచ్ అయిన 50 రోజుల్లోనే ఎక్స్టర్ కోసం...