Pushpa 2 : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న సీక్వెల్ మూవీ ‘పుష్ప: ద రైజ్’. విలువైన రెడ్ వుడ్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ గా వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజై సంచలన విజయం సొంతం అందుకుంది. ఎన్నో రికార్డులను క్రియేట్ చేయడంతో పాటు అల్లు అర్జున్ ను నేషనల్ స్టార్ చేసేసింది.
పుష్ప: ద రైజ్ భారీ హిట్ సాధించడంతో ‘పుష్ప: ద రూల్’పై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. దీనికి ఏమాత్రం తీసిపోని విధంగా సీక్వెల్ ను తెరకెక్కిస్తోన్నారు. దీంతో దీని కోసం కేవలం బన్నీ అభిమానులే కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఈగల్ గా వెయిట్ చేస్తుంది. సక్సెస్‌ఫుల్ కాంబోలో రూపొందుతున్న ‘పుష్ప: ది రూల్’కు సంబంధించి రెగ్యూలర్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. త్వరగా కంప్లీట్ చేసి ఆగస్ట్ 15వ తేదీన రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు.
ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ‘పుష్ప: ది రూల్’లో ఎంతో మంది స్టార్లు భాగం అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చాలా మంది బాలీవుడ్ ప్రముఖులను ఈ మూవీ కోసం తీసుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగానే ‘పుష్ప 2’లో పాన్ ఇండియా స్టార్‌ను ఎంపిక చేసుకున్నారని తెలిసింది.
‘పుష్ప: ది రూల్’లో అత్యంత ముఖ్యమైన పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్‌ను తీసుకున్నారని తెలిసింది. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్టుల్లో ఆయన ఎంట్రీ ఉంటుందట. సంజయ్ దత్ స్టోరీ వినేశారని, త్వరలోనే షూట్‌లో పాల్గొంటారని సమాచారం. ఆయన రాకతో మూవీ రేంజ్ పెరగబోతుంది.
ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న ‘పుష్ప: ది రూల్’ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రష్మిక మందన్నా హీరోయిన్ కాగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ లీడ్ రోల్స్ లో కనిపిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందజేస్తున్నాడు.