
UBLOOD APP : భారతదేశ వ్యాప్తంగా రక్తదానం, రక్త అవసరాలను సులభతరం చేసే డిజిటల్ ప్లాట్‌ఫారమ్ యూబ్లడ్ సేవలను తెలంగాణ ఐటీ, వాణిజ్య శాఖల మంత్రి దుద్దిర్ల శ్రీధర్ బాబు ప్రశంసించారు. ఈ యాప్ రక్తదాతలు, రక్తగ్రహీతలు, ఆసుపత్రులు, రక్త బ్యాంకులను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.
UBLOOD APP ప్రత్యేకత ఏమిటంటే, ఇది పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉండటమే కాదు, అత్యవసర పరిస్థితుల్లో రక్త అవసరాలను తక్షణమే తీర్చగలగే విధంగా రూపొందించబడింది. రక్తదానం చేయదలచిన వారు తమ వివరాలను నమోదు చేసుకుని, అవసరమైన వ్యక్తులకు సమయానికి సహాయం అందించగలుగుతారు.
- UBLOOD APP ముఖ్య లక్షణాలు..
-పూర్తిగా ఉచితం – దేశవ్యాప్తంగా ఎవరైనా ఉపయోగించుకోవచ్చు.
– అత్యవసర సేవలు – రక్త అవసరం ఉన్న వారికి వేగంగా సమాచారం చేరవేయడం.
– సులభమైన యూజర్ ఇంటర్‌ఫేస్ – అందరికీ సులభంగా ఉపయోగించేందుకు అనుకూలంగా రూపొందించబడింది.
-ఆసుపత్రులు & రక్త బ్యాంకుల భాగస్వామ్యం – విశ్వసనీయ , సమర్థవంతమైన రక్త సరఫరా.
యూబ్లడ్ APP ఉపయోగం గురించి మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ “ఈ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ సమాజానికి మేలుచేసే గొప్ప ఆవిష్కరణ. అత్యవసర పరిస్థితుల్లో సమయానికి రక్తం అందించడం అనేది ఎంతో కీలకం. దీని వల్ల రోగులకు అతి తక్కువ సమయంలో రక్తం అందించగలుగుతారు. ఇది సమాజంలో రక్తదానం సంస్కృతిని ప్రోత్సహించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది” అని అన్నారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా వేలాది మంది రక్తదాతలు ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. రక్తం అవసరమైన వారు, ఆసుపత్రులు, రక్త బ్యాంకులు ఈ యాప్ ద్వారా తమ అవసరాలను తీర్చుకోవచ్చు.
యూబ్లడ్ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే, ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్‌లో UBLOOD అని సెర్చ్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఉచిత డిజిటల్ సేవలు మరింత మంది రోగులకు ప్రాణాధారంగా మారాలని, రక్తదానానికి కొత్త ప్రేరణ కలిగించాలని ఆశిద్దాం!.
గత అమెరికా పర్యటనలోనూ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును యూబ్లడ్ ఫౌండర్ డా.జై గారు కలిశారు. ఈ సందర్భంగా యూబ్లడ్ యాప్ ద్వారా అందిస్తున్న సేవలను మంత్రి శ్రీధర్ బాబు ప్రశంసించారు. డా.జై గారు సమాజానికి అందిస్తున్న సేవలను కొనియాడారు. ఇలాంటి మానవతావాదులు సమాజానికి ఎంతో చేస్తున్నారంటూ పేర్కొన్నారు.
- Dr. Jai Garu Meet Minister Sridhar Babu at USA