
Minister KTR : తెలంగాణ ఐటీ, పారిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అమెరికా పర్యటనలో చాలా బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ స్టూడియోను ఇండియాకు, అందులో హైదరాబాద్ కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేసి సఫలీకృతుడయ్యాడు. ఇంకా తెలంగాణకు కావాలసిన, రావాల్సిన ప్రాజెక్టులపై ఆయన అక్కడి ఆయా కంపెనీల ప్రతినిధులతో విస్తృతంగా చర్చలు నిర్వహిస్తున్నాడు.
తెలంగాణ వైపు విస్తృతంగా కంపెనీలను ఆకర్షించేందుకు ఆయన శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ పెట్టుబడులు పెట్టేందుకు మౌలిక వసతులు ఉన్నాయని, కావాలంటే ప్రభుత్వం తరుఫు నుంచి మరిన్ని వనరులు సమకూరుస్తామని, తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన కోరుతున్నారు. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో తొమ్మిదేళ్ల నుంచి జరిగిన డెవలప్ మెంట్ పై ఆయన తన పర్యటనలో వ్యాపార దిగ్గజాలకు వివరిస్తున్నారు. మానవ వనరులు కూడా పుష్కలంగా ఉన్నాయని అందుకే తెలంగాణకు పెట్టుబడులు ఎక్కువ వస్తున్నాయని ఆయన చెప్పుకచ్చారు.
ఏరో స్పేస్ లో..
అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ అమెరికా రాజధాని అయిన వాషింగ్టన్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రౌండ్ టేబుల్‌కు ఆయన నేతృత్వం వహించారు. ఈ ఈవెంట్‌లో అమెరికాకు చెందిన పలువురు బిజినెస్ మ్యాన్లు, ఫౌండర్లు, స్టార్టప్ సంస్థలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో ఉన్నారు. గత తొమ్మిదేళ్లలో తెలంగాణలో ఏరోస్పేస్ రంగం, ప్రైవేట్ రంగ రక్షణ పెట్టుబడులు అద్భుతమైన వృద్ధి సాధించాయని మంత్రి కేటీఆర్ వారికి వివరించారు. అమెరికా ఏరోస్పేస్, డిఫెన్స్ కార్పొరేషన్లు భారత్‌లో పెట్టుబడి పెట్టేందుకు హైదరాబాద్ ఉత్తమ గమ్యస్థానంగా ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ కు ఎంతో భవిష్యత్ ఉందని మంత్రి వారికి వివరించారు. విప్లవాత్మక పారిశ్రామిక విధానం అయిన టీఎస్ఐపాస్ గురించి మంత్రి హైలైట్ చేశారు.