
Miryalaguda Constituency Review :
నియోజకవర్గ ఫోకస్: భాస్కర్ రావు మూడోసారి గెలుస్తారా?
నియోజకవర్గ ఫోకస్ : పొత్తులో కమ్యూనిస్టులకు పోతుందా?
——————————
బీఆర్ఎస్ అభ్యర్థి: భాస్కర్ రావు
కాంగ్రెస్ అభ్యర్థి: క్లారిటీ లేదు
బీజేపీ అభ్యర్థి: సరైన అభ్యర్థి కనిపించడం లేదు
——————————
ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయ విశిష్టతలు కలిగిన ప్రాంతం. తెలంగాణ సాయుధ పోరాటంలో ముందుండి నడిపించిన జిల్లా. జిల్లాలోని మిర్యాలగూడ కూడా ఎంతో ప్రత్యేకతలు కలిగిన నియోజకవర్గం. ఇక్కడ కమ్యూనిస్టులు తమ ప్రభావం చూపించారు. కమ్యూనిజం అంటేనే నల్గొండ అనే నానుడి ఉండేది. కాలక్రమంలో కమ్యూనిస్టుల పాలన అంతమైపోయింది.
ఇక్కడ జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ ఏడుసార్లు విజయం సాధిస్తే ఐదు సార్లు కమ్యూనిస్టులు గెలవడం గమనార్హం. ప్రస్తుత ఎమ్మెల్యే భాస్కర్ రావు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ లో చేరారు. తరువాత బీఆర్ఎస్ నుంచి మళ్లీ పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు మూడోసారి ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు.
నియోజవకవర్గంలో సమస్యలన్ని తీర్చానని చెబుతుంటే ప్రజలు మాత్రం పనులేవీ జరగలేదని అంటున్నారు. నియోజకవర్గానికి పవర్ ప్లాంట్ తీసుకొచ్చారు కానీ దేని మీద కూడా ఫోకస్ చేయలేదు. దీంతో నియోజకవర్గం డెవలప్ మెంట్ కోసం నోచుకోవడం లేదు. నియోజవకర్గానికి మహిళా డిగ్రీ కళాశాల కావాలనే డిమాండ్ కొన్నాళ్లుగా నానుతూనే ఉంది. దాని మీద ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు.
రైస్ మిల్లులు ఉన్న ప్రాంతం కావడంతో కాలుష్యం పెరుగుతోంది. పర్యావరణం పాడైపోతోంది. కానీ దీని నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. నియోజకవర్గంలో రోడ్లు కూడా అధ్వానంగా మారాయి. దీని వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ లో వర్గపోరు ఉండటంతో టికెట్ కోసం చాలా మంది ప్రయత్నిస్తున్నారు. దీంతో టికెట్ ఎవరికి దక్కుతుందో తెలియడం లేదు. జానారెడ్డి తన కొడుకును ఇక్కడనుంచి పోటీకి దింపాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
బీజేపీలో సరైన నేత లేకపోవడం ఆ పార్టీకి కంటగింపుగానే మారింది. ఇవన్ని అధికార పార్టీకి కలిసొచ్చే అంశంగానే తెలుస్తోంది. దీంతో మిర్యాలగూడ నియోజకవర్గంలో కమ్యూనిస్టులకు మంచి గుర్తింపు ఉండటంతో బీఆర్ఎస్ లో పొత్తులో భాగంగా దీన్ని కమ్యూనిస్టులకు కేటాయిస్తే భాస్కర్ రావు ఆశలు గల్లంతైనట్లేనని చెబుతున్నారు.
ReplyForward
|