
Miss Shetty Mr. Polishetty 12 Days Collections :
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ఎదిగిన బ్యూటీ లలో అనుష్క శెట్టి ఒకరు.. ఈ భామ తాజాగా స్ట్రాంగ్ కంబ్యాక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత ఐదేళ్లలో బాహుబలి తర్వాత మరో హిట్ అందుకోని ఈ భామ ఇప్పుడు మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి గ్రేట్ కంబ్యాక్ ఇచ్చింది.
”మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” సినిమాతో సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నవీన్ పోలిశెట్టి, అనుష్క ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాపై ముందు నుండి డీసెంట్ బజ్ క్రియేట్ అయ్యింది. దీంతో అనుష్క ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురు చూసారు. అనుకున్నట్టుగానే రిలీజ్ అవ్వడమే కాకుండా మంచి హిట్ కూడా అయ్యింది.
ఈ సినిమా మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తో దూసుకు పోతుంది.. తాజాగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని లాభాల్లో దూసుకు పోతూ నిర్మాతల జేబులను నింపుతుంది. కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను మహేష్ పి డైరెక్ట్ చేయగా మంచి టాక్ తో ముందుకు పోతుంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు నిర్మించగా రాధన్, గోపి సుందర్ మ్యూజిక్ అందించారు.
రెండు వారాలు అవుతున్న ఇప్పటికి ఈ సినిమా రన్ అవుతూ లాభాల్లోకి వచ్చేసింది. 12 రోజుల్లో ఈ మూవీ ఎంత రాబట్టిందంటే.. 12వ రోజు ఈ సినిమా కోటి గ్రాస్ 53 లక్షల షేర్ ను వసూలు చేసింది. ఇక మొత్తంగా తెలుగులో 12.18 కోట్ల షేర్ 21.55 కోట్ల గ్రాస్ రాబట్టింది.
మొత్తం వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఇప్పటి వరకు 21.33 కోట్ల షేర్, 41.20 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. 12.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కాగా 13.50 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమాకు మొత్తంగా ఇప్పటి వరకు 7.83 కోట్ల లాభాలు రావడంతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.